
సుగంధాల సిరులు
హన్మకొండ: తక్కువ స్థలంలో ఎక్కువ లాభాలు అర్జించాలన్నా.. కొంత పెట్టుబడితో అధిక రాబడిని సాధించాలన్నా.. పూల తోటల సాగు బెటర్ అని ఉద్యాన అధికారులు చెబుతున్నారు. ప్రభుత్వం రాయితీ అందిస్తుండడం, అధిక లాభాలు వస్తుండడంతో రైతులు ఇప్పుడిప్పుడే పూల సాగు వైపు దృష్టి సారిస్తున్నారు. వరి, పత్తి, మొక్కజొన్న వంటి సంప్రదాయ పంటల సాగుకు ప్రత్యామ్నాయంగా పూల తోటల సాగు నిలుస్తోంది. సీజన్‌కు అనుగుణంగా పంట చేతికొచ్చేలా సాగు చేస్తే అధిక లాభాలు అర్జించవచ్చు, పెళ్లిలు, శుభకార్యాలు, ప్రధాన పండుగలకు పంట చేతికి వచ్చేలా సాగు చేస్తే లాభాలు ఎక్కువగా వస్తాయి. హనుమకొండ జిల్లాలో ప్రస్తుతం 172 ఎకరాల్లో, వరంగల్ జిల్లాలో 133 ఎకరాల్లో పూల తోటల సాగు చేస్తున్నారు. ప్రభుత్వం రాయితీ అందిస్తూ పూల తోటల సాగు విస్తీర్ణం పెంచేందుకు ఉద్యాన పంటల అభివృద్ది మిషన్ ద్వారా రైతులను ప్రోత్సహిస్తోంది. విడి పూలు (మంతి, చామంతి, కనకాంబరం, మల్లె), సాగుకు ప్రభుత్వం ఉద్యాన శాఖ ద్వారా 40 శాతం రాయితీని అందిస్తోంది. ఎకరానికి రూ.8 వేల చొప్పున ఒక్కో రైతుకు 5 ఎకరాల వరకు రాయితీని పొందవచ్చు. దుంపజాతి పూల సాగు (గ్లాడియోలస్, లిల్లీ)కి 40 శాతం రాయితీ వస్తుంది. దుంప జాతి బహు వార్షిక పూలు అయిన గ్లాడియలస్, లిల్లీ, డైస్, జర్బేర వంటి సాగుకు ఉద్యాన శాఖ ద్వారా ఎకరాకు రూ.40 వేల చొప్పున ఒక్కో రైతుకు 5 ఎకరాల వరకు రాయితీ అందిస్తోంది.
పూల తోటల సాగుకు ప్రభుత్వ రాయితీ
తక్కువ ఖర్చుతో ఎక్కువ దిగుబడి
వరంగల్ జిల్లాలో 133 ఎకరాలు
హనుమకొండ జిల్లాలో
172 ఎకరాల్లో సాగు
అరటి సాగుకు ప్రోత్సాహం..
పండ్ల తోటల సాగును ప్రోత్సహించడంలో భాగంగా అరటి సాగు విస్తీర్ణం పెంచేందుకు ప్ర భుత్వం రాయితీ అందిస్తోంది. వరంగల్ జిల్లాలో 393 ఎకరాల్లో, హనుమకొండ జిల్లాలో 470 ఎకరాల్లో అరటి సాగు చేస్తున్నారు. అరటిని టిష్యూ కల్చర్, పిలకల పద్ధతిలో సాగు చేస్తారు. ఈరెండు సాగు పద్ధతులకు ప్రభుత్వం ఉద్యాన శాఖ ద్వారా రాయితీ అందిస్తోంది. టిష్యూ కల్చర్ మొక్కల ద్వారా సాగుకు నిర్వహణ ఖర్చులకు 40 శాతం బంచు కవర్స్ సాగుకు 50 శాతం రాయితీని అందిస్తున్నారు. టిష్యూ కల్చర్ అరటి సాగుకు ఎకరాకు రూ.28 వేల చొప్పున ఒక్కో రైతుకు 5 ఎకరాల వరకు, బంచ్ కవర్స్ అరటి సాగుకు ఎకరానికి రూ.10 వేల చొప్పున ఒక్కో రైతుకు 5 ఎకరాల వరకు రాయితీ అందిస్తున్నారు.

సుగంధాల సిరులు