
రైల్వే మంత్రికి వినతుల వెల్లువ..
కాజీపేట రూరల్: కాజీపేట రైల్వే మాన్యుఫ్యాక్చరింగ్ ఫ్యాక్టరీ యూనిట్ పరిశీలనకు వచ్చిన కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌కు పలువురు వినతులు సమర్పించారు. విజ్ఞప్తులు చేశారు. కాజీపేట రైల్వే వీఐపీ లాంజ్‌లో వరంగల్ ఎంపీ కడియం కావ్య, వరంగల్ పశ్చిమ, వర్ధన్నపేట ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్‌రెడ్డి, కె.ఆర్.నాగరాజు కలిసి పలు సమస్యలపై వినతి పత్రం అందజేశారు. కాజీపేటను రైల్వే డివిజన్ చేయాలని, రైల్వే మాన్యుఫాక్చరింగ్ యూనిట్‌లో స్థానికులకు 50 శాతం ఉద్యోగాలు ఇవ్వాలని, కాజీపేట బస్టాండ్ కోసం కావాల్సిన స్థలం కేటాయించాలని, చిరువ్యాపారులకు షాపింగ్ కాంప్లెక్స్‌ను నిర్మించాలని అందరం కోరినట్లు ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి తెలిపారు.
మంత్రి దృష్టికి రైల్వే సమస్యలు..
రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌కు రైల్వే జేఏసీ నాయకులు, రైల్వే మజ్దూర్ యూనియన్, రైల్వే ఎంప్లాయీస్ సంఘ్ నాయకులు, రైల్వే ఎస్సీ, ఎస్టీ, రైల్వే ఓబీసీ, రైల్వే పెన్షనర్ల సంఘాలు ఉమ్మడిగా రైల్వే, కార్మికుల సమస్యలపై వినతి పత్రం అందజేశారు. రైల్వే మాన్యుఫాక్చరింగ్ యూనిట్‌లో స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వాలని, భూ నిర్వాసితులకు ఉద్యోగాలు ఇవ్వాలని, కాజీపేటను డివిజన్ చేయాలని, కాజపేట టౌన్ స్టేషన్‌ను కారిడార్‌గా చేయాలని, రైల్వే ఇన్‌స్టిట్యూట్ (క్లబ్)ను పునరుద్ధరించి నూతన భవనం నిర్మించాలని, ఈఎల్‌ఎస్ ఫుట్ ఓవర్ బ్రిడ్జి నిర్మించాలని, ప్లాట్‌ఫామ్‌ల సంఖ్య పెంచాలని, కాజీపేటలో 16 రైళ్లకు హాల్టింగ్ కల్పించాలని వినతి పత్రాలు ఇచ్చారు. కార్యక్రమంలో దేవులపల్లి రాఘవేందర్, కొండ్ర నర్సింగరావు, కాల్వ శ్రీనివాస్, ఎస్.వెంకటనారాయణ, దిలీప్, ఆర్.రమేశ్, ఎంఎల్.నారాయణ, మాధవరావు, బిల్విందర్, పాషా, మధు, నారాయణ, వెంకటస్వామి, వేదప్రకాశ్, గిరిమిట్ల రాజేశ్వర్, జి.భాస్కర్, పి.రమేశ్ పాల్గొన్నారు. డీఎంఆర్‌కేఎస్ నుంచి యమునాకర్‌రెడ్డి, మంచాల రమేశ్, రాజు, మహేందర్, చంద్రమొగిళి.. రైల్వే మంత్రిని కలిసి కాజీపేట డివిజన్ చేయాలని, ఫిట్‌లైన్లను వినియోగంలోకి తీసుకురావాలని, రైల్వే లింక్‌లను పునరుద్ధరించాలని వినతిపత్రం అందజేశారు.
రైల్వే యూనిట్‌లో ఇంటికో ఉద్యోగం ఇవ్వాలి..
కేంద్ర మంత్రులు అశ్విని వైష్ణవ్, కిషన్‌రెడ్డిను కలిసి తమ భూమిని రైల్వే యూనిట్‌కు ఇచ్చామని, తమకు ఇంటికో ఉద్యోగం ఇవ్వాలని భూ నిర్వాసితులు గాదెం యాదగిరి, మామిండ్ల భిక్షపతి, జెరుపోతుల కుమారస్వామి, ఉల్లెంగుల శ్రీనివాస్, కాయిత స్వరూప, మామిండ్ల మల్లమ్మ వినతి పత్రం అందజేశారు. జిల్లా అధికారులు, రాష్ట్ర ప్రభుత్వం తమకు వివరాలు పంపిస్తే న్యాయం చేస్తామని మంత్రులు హామీ ఇచ్చారని గాదెం యాదగిరి తెలిపారు.
పుష్‌ఫుల్ రైలును పునఃప్రారంభించాలి
ఖిలా వరంగల్ : వరంగల్ నుంచి సికింద్రాబాద్ వరకు పుష్‌ఫుల్ రైలును పునః ప్రారంభించాలని బీజేపీ వరంగల్ జిల్లా అధ్యక్షుడు గంట రవికుమార్, వరంగల్ అర్బన్ కోఆపరేటివ్ బ్యాంకు చైర్మన్, బీజేపీ రాష్ట్ర నేత ఎర్రబెల్లి ప్రదీప్‌రావు.. రైల్వే మంత్రి అశ్వని వైష్ణవ్‌ను కోరారు. అలాగే, నెక్కొండలో శాతవాహన, పద్మావతి, ఇంటర్‌సిటీ రైళ్లకు హాల్టింగ్ ఇవ్వాలని కోరారు.