
సాయం చేద్దాం.. ప్రాణం కాపాడుదాం
జనగామ: అందరం ఒక్కటైతే ఆ ప్రాణం నిలబడుతుంది. చేయి చేయి కలిపితే అతడు బతుకుతాడు. మానవతావాదులు ముందుకు వచ్చి ఆపన్న హస్తం అందించాలని కుటుంబీకులు చేతులెత్తి వేడుకుంటున్నారు. వివరాల్లోకి వెళ్తే..
జనగామ జిల్లా కేంద్రం వీవర్స్ కాలనీకి చెందిన అందె శివప్రసాద్ మెడికల్ షాపులో పని చేస్తున్నాడు. తండ్రి చిన్నప్పుడే మృతి చెందగా తల్లి మహేశ్వరి కొడుకును పెంచి పెద్ద చేసింది. శివప్రసాద్‌కు పల్లవితో వివాహం చేయగా, ఆ దంపతులకు నాలుగు సంవత్సరాల కుమారుడు ఉన్నాడు. నెలంతా కష్టపడితే వచ్చే రూ.12వేల వేతనంతోనే శివప్రసాద్ కుటుంబాన్ని పోషించాడు. ఈ క్రమంలో ఇటీవల శివప్రసాద్ అనారోగ్యానికి గురికావడంతో కుటుంబీకులు ఆస్పత్రికి తీసుకెళ్లారు. మెడికల్ టెస్ట్‌లు పూర్తి చేసిన తర్వాత కాలేయ వ్యాధిగా నిర్ధారించారు. కొడుకు కష్టపడితేనే ఇల్లు గడిచే పరిస్థితుల్లో ఆ పెద్ద దిక్కే మంచం పట్టడంతో ఆ నిరుపేద కుటుంబం ఆగమైపోతుంది. శివప్రసాద్‌ను బతికించుకునేందుకు ఉన్న ఆస్తితో పాటు తల్లి, భార్య వద్ద ఉన్న కొద్దిపాటి బంగారాన్ని అమ్మి వైద్యానికి ఇప్పటి వరకు రూ.10లక్షల వరకు ఖర్చు చేశారు. ప్రతి నెల మందుల కోసం రూ. 20వేల వరకు ఖర్చు చేస్తున్నారు. అయినా ప్రస్తుతం అతడి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండడంతో వైద్యులు వెంటనే ఆపరేషన్ చేయాలని సూచించారు. ఇందుకు రూ.5లక్షలకు పైగా ఖర్చు అవుతుందని చెప్పడంతో చిల్లి గవ్వ లేక కుటుంబీకులు తల్ల డిల్లిపోతున్నారు. ఆపరేషన్ చేస్తే బతికే అవకాశం ఉండడంతో మనసున్న వారి సాయం కోసం ఎదురు చూస్తున్నారు. దాతలు ముందకొచ్చి ఓ ప్రాణం కాపాడాలని కుటుంబీకులతోపాటు అమ్మ ఫౌండేషన్ ప్రతినిధులు కోరుతున్నారు.
ఆర్థిక సాయం చేసే వారు ఫోన్ పే నంబర్‌తో పాటు బ్యాంకు ఖాతాకు నేరుగా పంపించొచ్చు. ఫోన్‌పే,గూగుల్ పే నంబర్:7036161005(అందె శివప్రసాద్)
బ్యాంకు ఖాతా నంబర్:1682104000047524(ఐడీబీఐ,జనగామ బ్రాంచ్)
ఐఎఫ్‌ఎస్ కోడ్:ఐబీకేఎల్0001682
కాలేయ వ్యాధితో
బాధపడుతున్న శివప్రసాద్
వైద్యానికి రూ.10 లక్షల ఖర్చు..
మరో రూ.5లక్షలు ఉంటేనే ఆపరేషన్..
చేతిలో చిల్లిగవ్వ లేని పరిస్థితి
దాతల సాయం కోసం
కుటుంబ సభ్యుల వేడుకోలు

సాయం చేద్దాం.. ప్రాణం కాపాడుదాం