
శనివారం శ్రీ 12 శ్రీ జూలై శ్రీ 2025
– 8లోu
మొత్తం నీటి కుళాయి కనెక్షన్లు
1,78,617
‘గ్రేటర్’లో చేయి తడిపితేనే నీటి కుళాయి కనెక్షన్ మంజూరు
● నేరుగా దరఖాస్తు చేసుకుంటే
నెలలు ఆగాల్సిందే
● సీజీజీతోనే కష్టాలు అంటున్న బల్దియా ఇంజనీర్లు
● నగరంలో సాగుతున్న నీటి చౌర్యం
● చోద్యం చూస్తున్న పాలకవర్గం పెద్దలు,
ఉన్నతాధికారులు
గృహ అవసరాలవి :
1,77,905
ఆదాయం : ఏడాదికి
రూ. 40 కోట్లు
కమర్షియల్ : 712
గ్రేటర్‌లో
ఇలా..
శివనగర్‌కు చెందిన మురళీ నల్లా కనెక్షన్ కోసం దరఖాస్తు చేసుకోగా, ఇప్పట్లో మంజూరయ్యే పరిస్థితి లేదని, రూ.5వేలు ఇస్తే మంజూరవుతుందని చెప్పి డబ్బు ఇచ్చాక కనెక్షన్ ఇప్పించాడు.
... ఇలా నగరంలో కొత్త నల్లాల జారీలో తీవ్ర జాప్యం ఏర్పడుతుండటంతో దళారులకు, లైన్‌మెన్లకు కాసుల పంట పడుతోంది. 50, 100 కనెక్షన్లు కాదు.. గత మూడు నెలల కాలంలో సుమారు 850 నల్లా దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. దీంతో నల్లా నీళ్ల కోసం ప్రజలు అడ్డదారులు తొక్కాల్సిన పరిస్థితులకు వారే కల్పిస్తుండటం పట్ల విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
నగరంలోని ప్రగతి నగర్‌కు చెందిన వెంకటేశ్వర్లు ఇటీవల భవన నిర్మాణ ధ్రువీకరణ పత్రాన్ని పొంది, ఇంటినంబర్ తీసుకుని కొత్త నల్లా కనెక్షన్‌కు దరఖాస్తు చేసుకున్నాడు. ఆరు నెలలు గడించింది. ఇంతవరకు కనెక్షన్ ఇవ్వలేదు.
పలివేల్పులకు చెందిన బి.సుజాత నల్లా కనెక్షన్ కోసం మూడు నెలలుగా దరఖాస్తు చేసి బల్దియా చుట్టూరా కాళ్లు అరిగేలా తిరుగుతున్నారు. కానీ సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ (సీజీజీ)లో సాంకేతిక సమస్య వల్ల మంజూరు ఇవ్వలేకపోతున్నామని ఏఈ చెబుతున్నారు.
వరంగల్ అర్బన్ : వరంగల్ మహానగరంలో అక్రమ నీటి కనెక్షన్ల వ్యవహారంలో బల్దియా ఇంజనీర్ల వైఖరిపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కొత్త ఇల్లు కట్టుకున్న యజమాని నల్లా కనెక్షన్ కోసం దరఖాస్తు చేసుకుంటే మంజూరుకు కనీసం నెల నుంచి 6 నెలల సమయం పడుతోంది. నిత్యావసరమైన నీటి అవసరాల రీత్యా క్షేత్రస్థాయిలో లైన్‌మెన్, వర్క్ ఇన్‌స్పెక్టర్లకు ఎంతో కొంత ముట్టచెప్పి కనెక్షన్ తీసుకోవడం నగరంలో సాధారణమైంది.
సిటిజన్ చార్టర్ ఏమంటుందంటే..
కొత్త నల్లా కనెక్షన్ కోసం నగర వాసులు నెలల తరబడి బల్దియా ప్రధాన కార్యాలయం, సర్కిల్ కార్యాలయాల చుట్టూ తిరగొద్దు. సిటిజన్ చార్టర్ ప్రకారం 7 రోజుల్లో మంజూరు చేయాలి. వెంటనే కనెక్షన్ ఇవ్వాలి. కానీ బల్దియా ఇంజనీర్ల నిర్లక్ష్యంతో నెలలు గడిచిపోతున్నాయి. కానీ నల్లా నీళ్లకు నోచుకోక ప్రజలు విసిగెత్తి చౌర్యానికి పాల్పడుతున్నారు.
సీజీజీ పేరుతో దాటవేత
2019లో కమిషనర్‌గా గౌతమ్ పనిచేసిన కాలంలో కొత్త నల్లా కనెక్షన్ల జారీలో సింగిల్ విండో సిస్టమ్ అమల్లోకి తీసుకొచ్చారు. దరఖాస్తు చేసుకున్న రెండు, మూడు రోజుల్లో ఏఈ స్థాయిలో జారీ ప్రక్రియ కొనసాగుతుండేది. ఆయన బదిలీ తర్వాత కొద్ది రోజులకే ఈ విధానాన్ని ఎత్తివేశారు. తదుపరి 2023 నుంచి సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ (సీజీజీ) అమల్లోకి వచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా కొత్త ఇంటినంబర్లు, పేరు మార్పిడిలు, ఆస్తుల విభజన, ట్రేడ్‌లైసెన్స్, నల్లా కనెక్షన్లు తదితర అంశాలు అన్నీ ఒకే గొడుగుకు కిందికి తీసుకొచ్చారు. సీజీజీలో సాంకేతిక లోపం కారణంగా ఆలస్యమవుతుందని ఇంజనీర్లు దాటవేస్తున్నారు. బల్దియా ఐటీ విభాగం నిపుణులను ప్రశ్నిస్తే సీజీజీ ఒక కారణమైతే ఇంజనీర్లు పట్టించుకోవడం లేదని చెబుతున్నారు. ఇలా ఎవరికి వారు కొత్త నల్లా కనెక్షన్ల జారీలో అలసత్వం ప్రదర్శిస్తుండటం పట్ల ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు.
న్యూస్‌రీల్
అడ్డదారిలో అనుమతులు..
కొత్త నల్లా కనెక్షన్ల జారీలో జాప్యం అవుతుండడం, నీటి అవసరం ఉండడంతో నగరవాసులు మధ్యవర్తులుగా లైన్‌మెన్లను ఆశ్రయిస్తున్నారు. ఒక్కో కనెక్షన్‌కు రూ.3వేల నుంచి రూ.5వేల వరకు గుంజుతున్నారనే ఆరోపణలున్నాయి. ఇప్పటికే నగరవ్యాప్తంగా సుమారు 13వేల అక్రమ నల్లా కనెక్షన్లు ఉన్నట్లు ఇంజనీర్ల విచారణలో తేలింది. కొత్తవి మంజూరులో జాప్యం కారణంగా అక్రమ కనెక్షన్లు పెరిగిపోతున్నాయి. ఈ విషయమై బల్దియా ఇంజనీర్లను వివరణ కోరితే ఈఈల బదిలీ కారణంగా లాగిన్‌లు సకాలంలో కావడం లేదు.. దీంతో కనెక్షన్ల మంజూరులో జాప్యం జరుగుతున్న విషయం వాస్తమేనని అంగీకరించడం గమనార్హం.

శనివారం శ్రీ 12 శ్రీ జూలై శ్రీ 2025