
బకాయిలపై నిర్లక్ష్యం తగదు●
● ప్రతినెలా 10లోపు వసూలు చేయాలి
● డీఎంఓల సమావేశంలో జేడీ శ్రీనివాస్
వరంగల్ చౌరస్తా: మార్కెట్ ఫీజుల బకాయి ఫీజుల వసూలులో ఏ మాత్రం నిర్లక్ష్యం తగదని మార్కెటింగ్ జాయింట్ డైరెక్టర్ ఉప్పల శ్రీనివాస్ హెచ్చరించారు. వరంగల్ లక్ష్మీపురంలోని జేడీ కార్యాలయంలో డీడీఎంఓలతో శుక్రవారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మార్కెట్ ఫీజు పాత బకాయిలతోపాటు కొత్తగా ఫీజును ప్రతినెలా 10వ తేదీలోపు వసూలు చేయాలని సూచించారు. చెక్ పోస్టులు నిర్దేశిత టార్గెట్లను వసూలు చేయాలన్నారు. సమావేశంలో డీడీఎం ఒడితల పద్మావతి, డీఎంఓ పద్మావతి, సిబ్బంది పాల్గొన్నారు.