
గురువారం శ్రీ 10 శ్రీ జూలై శ్రీ 2025
– 8లోu
వరంగల్ అర్బన్: నగరం విస్తరిస్తోంది. చెట్లు నరికివేతకు గురవుతున్నాయి. అకాల వర్షాలు వణికిస్తున్నాయి. వరదలు లోతట్టు ప్రాంతాల్ని ముంచెత్తుతున్నాయి. వాతావరణంలో పెను మా ర్పులు సంభవిస్తున్నాయి. ప్రకృతి సమతుల్య తను పెంపొందించేందుకు.. చారిత్రక, వారసత్వ ఓరుగల్లు నగరాన్ని వనాలకు కేరాఫ్‌గా నిలిపేందుకు కార్యాచరణ పూర్తయ్యింది. సీఎం రేవంత్‌రెడ్డి, మేయర్ గుండు సుధారాణి, కమిషనర్ ఆదేశాల మేరకు జీడబ్ల్యూఎంసీ అధికారులు కసరత్తు పూర్తి చేశారు. ఇటీవల 100 రోజుల ప్రణాళిక కార్యక్రమంలో అధికారికంగా పెద్ద ఎత్తున మొక్కలు నాటేందుకు రంగం సిద్ధం చేశారు. ఆగస్టులో వారం వ్యవధిలో 15.50 లక్షల మొక్కలు నాటేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. ఇందుకుగాను బల్దియా పరిధిలో 10.50 లక్షల మొక్కలు నర్సరీల్లో అందుబాటులో ఉన్నాయి. మరో 5 లక్షల మొక్కలు దిగుమతి చేసుకునేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.
తట్టుకునేలా..
నగర వాతావరణంలో సులువుగా, బలమైన వేర్లతో వృద్ధి చెందే దేశీ జాతి మొక్కలకు వన మహోత్సవంలో అధిక ప్రాధాన్యమిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. అవసరమైన చోట రావి, దారి పొడవునా, పార్కులు, సంస్థల్లో నీడనిచ్చే మొక్కలు పెంచుతామంటున్నారు. గాలి, వానను తట్టుకుని నిలిచే వాటిపై దృష్టిపెట్టనున్నట్లు స్పష్టం చేస్తున్నారు.
ఇంటికి ఆరు మొక్కలు
నగర వ్యాప్తంగా ఒక్కో ఇంటికి 6 మొక్కలు పంపిణీ చేయాలని బల్దియా ఉద్యాన శాఖ అధికారులు లక్ష్యం పెట్టుకున్నారు. ఆయా డివిజన్లలో అందుబాటులో ఉన్న వాటర్ ట్యాంకులు, పార్కులు, నర్సరీల్లో వీటిని పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేశారు. పలు రకాల పండ్లు, పూల జాతులు, నీడనిచ్చే మొక్కల్ని అందజేయనున్నారు. అదేవిధంగా ప్రధాన రహదారుల పక్కన, కాలనీ రోడ్లు, అంతర్గత రహదారులు, మోడల్ కాలనీల వెంట మాస్టర్ ప్లాన్‌కు సంబంధించిన 80,60 ఫీట్ల రహదారుల్లో మల్టీ రో–అవెన్యూ మొక్కలతో అలంకరణ జాతులకు చెంది న మొక్కలను అవెన్యూ ప్లాంటేషన్ కింద విస్తృతంగా నాటనున్నారు.
60.3 ఎకరాల్లో..
నగరవ్యాప్తంగా ఉన్న లే–ఔట్ స్థలాలు 60.3 ఎకరాలు ఉన్నాయి. ఆయా ప్రాంతాల్లో విరివిగా మొక్కలు నాటనున్నారు. టీఆర్టీ కాలనీ 3,407, పుప్పాలగుట్ట 2,816, లక్ష్మీమెగా టౌన్‌షిప్ గ్యాప్‌లో 150, లక్ష్మీ మెగా టౌన్ షిప్‌లో 2,200, అక్షర టౌన్ షిప్‌లో 145, మామునూరులో 168, ఉర్సు మంకీ ఫుడ్ కోర్ట్ 175, పైడిపల్లి ఓపెన్ స్పేస్‌లో 2,200, రెడ్డి పాలెంలో 450, పలివేల్పులలో 550, శంభునిపేట మియావారి ప్రాంతంలో 13,200, కనకదుర్గ కాలనీ పార్కులో 8,976, ఇతర ప్రాంతాల్లో 12,063 మొక్కలు నాటనున్నారు.
అవెన్యూ ప్లాంట్స్
నగర వ్యాప్తంగా ఉన్న 149 కిలోమీటర్ల పరిధి 42 రహదారుల్ని గుర్తించారు. అందులో 26,335 మొక్కలు నాటనున్నారు. అంతేకాకుండా మీడియం, జంక్షన్లు 65.95 చదరపు కిలోమీటర్లు ఉండగా.. 3,23,465 మొక్కలు నాటాలని నిర్ణయించారు. అదే విధంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థలు, ఆస్పత్రులు, హాస్టళ్లు తదితర 16 ప్రాంతాల్లో ఇన్‌స్టలేషన్ ప్రాంతాల్లో 45,800 మొక్కలు నాటనున్నట్లు తెలిపారు. మడికొండ ఓఆర్‌ఆర్‌లో 6 ప్రాంతాల్లో 1,000 మొక్కలు, విద్యుత్ నగర్ 1,000 మొక్కలు నాటాలని నిర్ణయించారు. ఇవేకాకుండా చెరువులు, గట్లు 18 ప్రాంతాల్లో 32 వేల మొక్కలు నాటనున్నారు. ఖాళీ స్థలాలతోపాటు, శ్మశాన వాటికల్లో పెద్ద ఎత్తున మొక్కలు నాటేందుకు ప్రతిపాదనలు రూపొందించారు.
భట్టుపల్లి నర్సరీలో పంపిణీకి సిద్ధంగా ఉన్న మొక్కలు
అందరినీ భాగస్వాముల్ని చేస్తాం..
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న వన మహోత్సవాన్ని నగరంలో అమలు చేసేందుకు ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేసుకున్నాం. మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు, స్లమ్ సమాఖ్యల ప్రతినిధులను, కాలనీ అసోసియేషన్, వేల్ఫేర్ కమిటీ ప్రతినిధులను, స్వచ్ఛంద, యువజన సంఘాలందరినీ ఈ బృహత్తర కార్యక్రమంలో భాగస్వామ్యం చేస్తాం. – రమేశ్, బల్దియా ఉద్యానవన అధికారి
●
న్యూస్‌రీల్
ఏయే నర్సరీల్లో ఎన్ని?
హరిత నగరానికి అన్ని ఏర్పాట్లు
వారం రోజుల్లో
వన మహోత్సవానికి శ్రీకారం
ప్రతీ ఇంటికి 6 మొక్కల
పంపిణీకి ఏర్పాట్లు
కార్యాచరణ రూపొందించిన బల్దియా ఉద్యాన శాఖ అధికారులు

గురువారం శ్రీ 10 శ్రీ జూలై శ్రీ 2025