
సంక్షేమ ప్రదాత వైఎస్సార్
పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి
హన్మకొండ చౌరస్తా: పేదల సంక్షేమమే లక్ష్యంగా అనేక సంక్షేమ పథకాలను అమలు చేసిన గొప్ప వ్యక్తి దివంగత సీఎం డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి అని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి అన్నారు. వైఎస్‌ఆర్ జయంతిని పురస్కరించుకుని హనుమకొండలోని డీసీసీ భవన్‌లో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. రాజేందర్‌రెడ్డి మాట్లాడుతూ వైఎస్సార్ సీఎంగా ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్‌మెంట్, రైతులకు రుణ మాఫీ, ఉచిత విద్యుత్‌లాంటి అనేక సంక్షేమ పథకాలను దిగ్విజయంగా అమలుచేశారని పేర్కొ న్నారు. ఆయన పాలన అందరికీ రోల్ మోడల్ అన్నారు. ఉమ్మడి రాష్ట్ర ప్రజల గుండెల్లో నేటికి చిరస్థాయిగా నిలిచిన మహావ్యక్తి అని కొనియాడారు.