
ఉల్లం‘ఘనుల’పై కొరడా
‘గ్రేటర్’ ట్రేడ్ వ్యాపార సంస్థలకు కమర్షియల్ ట్యాక్స్
వీఎల్‌టీపై బాదుడే
● జల్లెడ పడుతున్న రెవెన్యూ, ప్రజారోగ్య విభాగం సిబ్బంది ● గ్రేటర్ వరంగల్ ఆదాయం పెంపే లక్ష్యంగా ప్రత్యేక బృందాలు ● కమిషనర్ వార్నింగ్‌తో కదిలిన యంత్రాంగం
వరంగల్ అర్బన్ : బల్దియాకు ప్రతీ ఏడాది రావా ల్సిన రూ.కోట్ల ఆదాయం చేజారిపోయింది. అన్నీ తెలిసి చేతివాటానికి అలవాటు పడిన అధికారులు కళ్లున్నా కబోధులయ్యారు. అడ్డదారిలో జేబులను నింపుకుంటున్నారు. ఇటీవల గ్రేటర్ వరంగల్ కమిషనర్‌గా విధుల్లో చేరిన చాహత్ బాజ్ పాయ్ పిన్‌పాయింట్‌గా లెక్కలు వేసి తప్పిదాలను బహిర్గతం చేయడంతో ఆయా విభాగాల అధికారులు, సిబ్బంది గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. ఆస్తిపన్ను, ట్రేడ్ లైసెన్స్ పన్నుల్లో తేడాలొస్తే
– మిగతా 4లోu
లెక్క.. పక్కా
వాణిజ్య, నివాస గృహాల పన్ను మగింపును ఒకవైపు భువన్ యాప్ ద్వారా కొలతల తీసుకోవడంతోపాటు మాన్యువల్‌గా కొలతలు వేసేందుకు బల్దియా పన్నుల విభాగం సిబ్బంది రంగంలోకి దిగారు. జోన్ల వారీగా భవనాల పింత్ ఏరియాను వడబోసి పన్ను కేటాయింపులు చేపట్టేందుకు శ్రమిస్తున్నారు. నామమాత్రపు పన్ను చెల్లిస్తూ బల్దియా ఆదాయానికి గండి కొడుతున్న వారిపై కొరడా ఝుళిపించనున్నారు. నిర్మాణాలను అంగుళం వదలకుండా వాణిజ్య, నివాస నిర్మాణాలను కొలతలు వేసి పన్ను బాదుతారు. అంతేకాకుండా ట్రేడ్ లైసెన్స్ తీసుకోని వాణిజ్య సంస్థలకు రెట్టింపు చార్జీలు విధిస్తూ పన్ను బాదనున్నారు. దీంతో వ్యాపార, నివాస యజమానులకు కొంత ఆందోళన కలుగుతోంది. ఇంతకాలం పన్ను ఎగ్గొట్టడానికి అలవాటుపడిన వారు జీర్ణించుకోలేకపోతున్నారు. ఏది ఏమైనా కొత్త కమిషనర్ నిర్ణయం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.