
వినతుల పరిష్కారంలో జాప్యం చేయొద్దు
హనుమకొండ కలెక్టర్
స్నేహ శబరీష్
హన్మకొండ అర్బన్: ప్రజావాణిలో స్వీకరించిన అర్జీల పరిష్కారంలో అధికారులు జాప్యం చెయొద్దని హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరీష్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణిలో కలెక్టర్ నేరుగా పాల్గొని ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ఈసందర్భంగా ప్రజావాణి వినతుల్ని త్వరగా పరిష్కరించుకోవాలని, వచ్చిన వినతులపై తక్షణమే చర్యలు చేపట్టాలని జిల్లాలోని పలువురు తహసీల్దార్లను వీడియో కాన్ఫరెన్స్‌లో ఆదేశించారు. ప్రజావాణిలో వివిధ శాఖలకు మొత్తం 176 దరఖాస్తులు స్వీకరించినట్లు తెలిపారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ వెంకట్‌రెడ్డి, జిల్లా రెవెన్యూ అధికారి వైవీ గణేశ్, ఆర్డీఓలు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
సమస్యలు త్వరగా పరిష్కరించాలి..
వరంగల్ కలెక్టర్ సత్యశారద
న్యూశాయంపేట: ప్రజావాణి దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలని వరంగల్ కలెక్టర్ సత్యశారద అధికారులకు సూచించారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణిలో కలెక్టర్ ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. మొత్తం 130 వినతులు రాగా.. దరఖాస్తులను ఆయా శాఖల అధికారులకు ఎండార్స్ చేశారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ సంధ్యారాణి, డీఆర్‌ఓ విజయలక్ష్మి, జెడ్పీ సీఈఓ రాంరెడ్డి పాల్గొన్నారు.
ప్రభుత్వ భూమిని కాపాడాలి
వరంగల్‌లోని 13వ డివిజన్ దేశాయిపేట సీకేఎం కళాశాల గ్రౌండ్‌ను ఆనుకుని 2 ఎకరాల ప్రభుత్వ స్థలం ఉంది. కొందరు గుర్తుతెలియని వ్యక్తులు ఆ భూమిని ఆక్రమించేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రభుత్వ భూమిని కాపాడాలి.
– జన్ను అనిల్‌కుమార్, వరంగల్

వినతుల పరిష్కారంలో జాప్యం చేయొద్దు