ఆషాఢం వేడుకల వేళ.. | - | Sakshi
Sakshi News home page

ఆషాఢం వేడుకల వేళ..

Jun 28 2025 7:17 AM | Updated on Jun 28 2025 7:17 AM

ఆషాఢం

ఆషాఢం వేడుకల వేళ..

హన్మకొండ కల్చరల్‌: ఆషాఢం వేడుకలకు సమయం ఆసన్నమైంది. ఉమ్మడి వరంగల్‌ జిల్లా వ్యాప్తంగా తొలకరి వానలు పలకరించాయి. ఫలితంగా పంటల సాగుతో పాటే గ్రామ దేవతల (బోనాలు)కు పూజలు మొదలు కానున్నాయి. ఆషాఢ మాసం గురువారం ప్రారంభమైంది. ఇదే సమయంలో గ్రామాల్లో అమ్మవారిని కొలిచేందుకు ప్రజలు సన్నద్ధమవుతున్నారు. మహిళలు కలిసికట్టుగా బయలుదేరి మొక్కులు చెల్లించనున్నారు. కాగా, ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో తొలిఏకాదశి నాడు బీరన్న బోనాలు వైభవంగా నిర్వహిస్తారు. ఆషాఢ మాసంలో ప్రతీరోజు గ్రామ దేవతలను భక్తిశ్రద్ధలతో కొలుస్తారు. కొందరికి గ్రామదేవతలకు బోనాలు సమర్పించే సంప్రదాయం కూడా ఉంది. ఇలవేల్పులైన అమ్మవార్లకు మొక్కులు చెల్లిస్తారు.

ఆలయాల్లో ఉత్సవాలు..

ఆషాఢ మాస శుద్ధ ఏకాదశి రోజున విష్ణువు యోగా నిద్రలోకి వెళ్లిన రోజుగా భావిస్తూ ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఇదే సమయంలో పూరి జగన్నాథ రథయాత్ర, గురుపౌర్ణమిని వ్యాస పౌర్ణమిగా వేడుకగా జరుపుకోనున్నారు. అలాగే, వరంగల్‌ జిల్లాలో శ్రీభద్రకాళి అమ్మవారికి శాకంబరీ ఉత్సవాలు నిర్వహించడం ప్రత్యేకం.

గోరంటాకు మురిపెం.. ఆరోగ్యదాయకం

వర్షకాలం ప్రారంభమై బావులు, వాగులు, చెరువుల్లోకి కొత్త నీరొస్తుంది. ఇది చర్మవ్యాధులు వ్యాప్తి చెందే కాలం. వీటి బారి నుంచి ఆరోగ్యాన్ని రక్షించుకునేందుకు గోరింటాకు ఔషధంగా పని చేస్తుంది. ఈ నేపథ్యంలోనే ఆషాఢ మాసంలో మహిళలు గో రింటాకును (మెహందీ) అలంకరించుకోవడం సంప్రదాయంగా వస్తోంది. ఆయుర్వేద వైద్య నిపుణులు గోరింటాకు చర్మ వ్యాధుల నుంచి రక్షణ ఇస్తుందని, శరీరంలో వేడి తగ్గిస్తుందని పేర్కొంటున్నారు.

వనభోజనాల సందడి..

ఆషాఢ మాసంలో వనభోజనాలు ప్రత్యేక ఆకర్షణగా చెప్పవచ్చు. ప్రధానంగా గ్రామాల్లోని వర్షాలు సమృద్ధిగా కురిసి, పాడి పంటలు వెల్లివిరియాలని కోరుకుంటారు. గ్రామదేవతలకు పూజలు నిర్వహించి ప్రకృతి ఒడిలో పచ్చని పంట పొలాల మధ్య చెట్ల కింద సామూహిక వనభోజన సంబురాలు జరుపుకుంటారు. పట్టణ ప్రాంతాల్లో సైతం ఈ సంప్రదాయం కొనసాగుతోంది.

భక్తిశ్రద్ధలతో గ్రామ దేవతలకు పూజలు

అమ్మవార్లకు మొక్కుల చెల్లింపులకు సిద్ధం

తొలిఏకాదశి నాడు బీరన్న బోనాలు ప్రత్యేకం

గురువారం ప్రారంభమైన మాసం

ఆరోగ్యం.. ఆనందం

హిందూ సనాతన ధర్మంలో ఆరోగ్యం, ఆనందం కోసం కొన్ని పద్ధతులు అనాదిగా వస్తున్నాయి. ఇందులో కుంకుమ, తిలకం అద్దుకోవడం, విభూదిధారణ, గంధ ధారణ, కాటుక, గోరింటాకు పెట్టుకోవడం లాంటి పద్ధతులు ఉన్నాయి. ఆయుర్వేదం ప్రకారం గోరింటాకు పెట్టుకోవడం వల్ల శరీరంలో ఉన్న వేడి తగ్గి ఆరోగ్యంగా ఉంటామని, అలాగే శరీరం కళకళలాడుతుందని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వేయిస్తంభాల దేవాలయం ప్రధానార్చకుడు గంగు ఉపేంద్ర శర్మ తెలిపారు.

గోరింటాకు వేడుకలు

హసన్‌పర్తి: ఆషాఢ మాసాన్ని పురస్కరించుకుని గోరింటాకు వేడుకలను మహిళలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. నగరంలోని 55వ డి విజన్‌ సత్యసాయి కాలనీలో అతివలు అరచేతిలో గోరింటాకు పెట్టుకుని మురిసిపోయారు. కార్యక్రమంలో తుమ్మ వనమాల, ఎర్రబెల్లి సుజాత, చెరుకు కృష్ణవేణి, చిట్టిరెడ్డి మంగ పూల్లూరి సరోజన, లావణ్య, చింత జ్యోతి, తుమ్మ ప్రియాంక, తుమ్మ పద్మ నిహాసి పాల్గొన్నారు.

ఆషాఢం వేడుకల వేళ..1
1/3

ఆషాఢం వేడుకల వేళ..

ఆషాఢం వేడుకల వేళ..2
2/3

ఆషాఢం వేడుకల వేళ..

ఆషాఢం వేడుకల వేళ..3
3/3

ఆషాఢం వేడుకల వేళ..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement