
పరిశీలిస్తూ.. ప్రశ్నిస్తూ
ఎంజీఎం : నేషనల్ మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఎన్‌ఎంసీ) మెడికల్ కాలేజీల్లో వసతులపై జారీ చేసిన షోకాజ్ నోటీసుల నేపథ్యంలో.. రాష్ట్ర ప్రభుత్వం నియమించిన పర్యవేక్షణ కమిటీ శుక్రవారం నగరంలోని కేఎంసీ, ఎంజీఎం, సీకేఎం, జీఎంహెచ్ ఆస్పత్రులను తనిఖీ చేసింది. పర్యవేక్షణ కమిటీ చైర్మన్, రాష్ట్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ సంగీత సత్యనారాయణ.. హనుమకొండ, వరంగల్ కలెక్టర్లు స్నేహ శబరీష్, సత్యశారదతో కలిసి ముందుగా కాకతీయ మెడికల్ కళాశాల(కేఎంసీ)ను సందర్శించారు. బోధన సిబ్బంది, పరికరాల లేమిపై ఆయా విభాగాఽధిపతులతో సమీక్షించారు. కేఎంసీలో హెమటాలజీ విభాగాన్ని, వైద్యవిద్యార్థుల వసతి గృహాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి.. ప్రిన్సిపాల్ రాంకుమార్‌రెడ్డిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం మెడికల్ కళాశాలను, ప్రస్తుతం ఉన్న వైద్య అధ్యాపకుల పోస్టుల ఖాళీలు, మౌలిక వసతులపై ప్రభుత్వానికి నివేదించేందుకు పలు అంశాలపై చర్చించారు.
పీఎంఎస్‌ఎస్‌వై ఆస్పత్రి పరిశీలన..
కేఎంసీ ప్రాంగణంలోని పీఎంఎస్‌ఎస్‌వై ఆస్పత్రిని కమిషనర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. డయాలసిస్ యూనిట్‌తోపాటు ఆపరేషన్ థియేటర్, యూ రాలజీ విభాగాన్ని తనిఖీ చేశారు. పలు అంశాలపై ఆయా విభాగాల వైద్యులతో మాట్లాడి సమస్యలు వివరిస్తున్న క్రమంలో వసతుల లేమిపై ప్రభుత్వానికి రాత పూర్వకంగా నివేదించాలని ఆదేశించా రు. పరికరాల మరమ్మతులో అలసత్వం వహిస్తే సహించేది లేదన్నారు. చిన్న చిన్న సమస్యలతో రోగులకు సేవలు నిలిపేయకుండా చూడాలన్నా రు. అనంతరం కేయూ జంక్షన్‌లోని క్షయ ఆస్పత్రిని సందర్శించి రోగులు, ఓపీ సేవల గురించి ఆరా తీశారు. మెడికల్ వ్యర్థాలను ఎక్కడికి తరలిస్తున్నారన్న విషయాలను అడిగి తెలుసుకున్నారు.
ఎంజీఎంలో ఫార్మసీ సూపర్‌వైజర్‌పై
చర్యలకు ఆదేశాలు
ఎన్‌ఎంసీ నిబంధనల ప్రకారం మౌలిక వసతుల కల్పనలో భాగంగా ఎంజీఎం ఆస్పత్రిని సాయంత్రం కమిషనర్ డాక్టర్ సంగీతసత్యనారాయణ సందర్శించారు. మొదట ఓపీ విభాగాన్ని పరిశీలించి కౌంటర్లు పెంచాలని ఆదేశించారు. ఫార్మసీ విభా గంలో ఈ–ఔషధి నమోదులో వివరాలు చెప్పడంలో విఫలమైన ఫార్మసీ సూపర్‌వైజర్‌ను సస్పెండ్ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. అనంతరం రోగులకు అందించే భోజనశాల, పిల్లల విభాగా న్ని పరిశీలించి ఆరోగ్య మహిళ పథకం ద్వారా అందుతున్న సేవలపై ఆరా తీశారు. అదేవిధంగా సీకేఎం ఆస్పత్రిని సందర్శించి ఆయా వార్డులు, ఓపీ సేవలు, రెఫరల్స్, ఫాలోఅప్ వంటి అంశాలను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో ఎంజీఎం సూపరింటెండెంట్ కిశోర్, హనుమకొండ, వరంగల్ డీఎంహెచ్‌ఓలు అప్పయ్య, సాంబశివరావు, ఆర్‌ఈహెచ్ సూపరింటెండెంట్ భరత్, సీకేఎం ఆస్పత్రి వైద్యులు పాల్గొన్నారు.
హాజరుశాతంపై చర్యలు తప్పవు..
నేషనల్ మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నిబంధనల ప్రకారం వైద్యుల హాజరుశాతాన్ని ఫేస్ బ యోమెట్రిక్‌తో చేపట్టాలని కమిషనర్.. వైద్య ఆరోగ్యశాఖాధికారులకు స్పష్టం చేశారు. దీనిపై ఎంజీఎం సూపరింటెండెంట్ స్పందించి అలాంటి హా జరుశాతం ఎంజీఎంలో మొదలు కాలేదని సాంకేతిక కారణాలు చెప్పగా, బయోమెట్రిక్ అటెండెన్స్ తప్పనిసరి అని ఆదేశించారు. భవిష్యత్‌లో వైద్యు ల హాజరుశాతంపై బయోమెట్రిక్ ఆధారంగా చర్యలు ఉంటాయని ఆమె స్పష్టం చేశారు.
ఎన్‌ఎంసీ షోకాజ్ నోటీసులతో
ఆస్పత్రులను సందర్శించిన
పర్యవేక్షణ కమిటీ
కేఎంసీ, ఎంజీఎం, సీకేఎం,
జీఎంహెచ్ ఆస్పత్రుల తనిఖీ
సమస్యలను రాతపూర్వకంగా
ప్రభుత్వానికి పంపించండి..
పర్యవేక్షణ కమిటీ ౖచైర్మన్
డాక్టర్ సంగీత సత్యనారాయణ
ఎంజీఎంలో ఫార్మసీ సూపర్‌వైజర్ సస్పెన్షన్‌కు ఆదేశాలు

పరిశీలిస్తూ.. ప్రశ్నిస్తూ

పరిశీలిస్తూ.. ప్రశ్నిస్తూ