
ఆర్గనైజ్డ్ క్రైమ్స్‌పై దృష్టి పెట్టండి
వరంగల్ క్రైం: ఆర్గనైజ్డ్ క్రైమ్స్‌కు పాల్పడే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదలవద్దని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్‌సింగ్ టాస్క్‌ఫోర్స్ అధికారులను ఆదేశించారు. సీపీ శుక్రవారం టాస్క్‌ఫోర్స్ కార్యాలయాన్ని సందర్శించారు. ఈసందర్భంగా టాస్క్ ఫోర్స్‌లో పని చేస్తున్న అధికారులు, సిబ్బందిని విధులు, బాధ్యతలపై ఆరా తీశారు. చట్ట వ్యతిరేక కార్యకలపాలకు పాల్పడే వ్యక్తుల వివరాలు సేకరించేందుకు బలమైన ఇన్‌ఫార్మర్ వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. నమ్మకం కలిగేలా పనిచేయాలని సూచించారు. ఈసందర్భంగా టాస్క్‌ఫోర్స్ ఏసీపీ మధుసూదన్ సీపీకి పూలమొక్క అందించి స్వాగతం పలికారు.