శనివారం శ్రీ 26 శ్రీ ఏప్రిల్‌ శ్రీ 202 | - | Sakshi
Sakshi News home page

శనివారం శ్రీ 26 శ్రీ ఏప్రిల్‌ శ్రీ 202

Apr 26 2025 1:39 AM | Updated on Apr 26 2025 1:41 AM

శుక్రవారం ఉష్ణోగ్రతలు (డిగ్రీ సెల్సియస్‌)

42.6

ఖిలావరంగల్‌

హన్మకొండ: వేసవిలో ఉద్యాన పంటలను తగు జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా కాపాడుకోవచ్చు. కిచెన్‌, రూఫ్‌ గార్డెన్‌ నిర్వహిస్తున్న వారు అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలి. తమ కుటుంబానికి సరిపడా కూరగాయలు పండాలంటే ఎంత స్థలంలో సాగు చేయాలనే విషయాన్ని ముందుగా తెలుసుకోవాలి. సాగుకోసం నర్సరీ నుంచి నాణ్యమైన మొక్కలు తెచ్చి పెంచుకోవాలి. మొక్కలను ఎండ, వాన ఇతర ప్రతికూల పరిస్థితులనుంచి కాపాడుకోవాలి. వేసవిలో అధిక ఉష్ణోగ్రతలతో పూత రాలిపోతుంది. మొక్కలకు ఎప్పుడు తేమ తగిలేలా చూసుకోవాలి. కర్రల సాయంతో గ్రీన్‌ షేడ్‌నెట్‌ ఏర్పాటు చేసుకుంటే మంచిది. వేప నూనె, కషాయాలు మొక్కల పాదులో కాకుండా పైనా పిచికారీ చేయాలి. అప్పుడే మొక్క ఆరోగ్యంగా ఉంటుంది. – చేరాల రాకేశ్‌, వరంగల్‌ ఉద్యాన అధికారి (టెక్నికల్‌)

ఎడ్ల బండ్ల ప్రదర్శన

హసన్‌పర్తి: ఈనెల 27వ తేదీన ఎల్కతుర్తిలో జరగనున్న బీఆర్‌ఎస్‌ రజతోత్సవ సభ విజయవంతానికి శుక్రవారం దేవన్నపేట, కోమటిపల్లి కార్యకర్తలు శుక్రవారం హసన్‌పర్తిలో ఎడ్ల బండ్ల ప్రదర్శన నిర్వహించారు. కార్యక్రమానికి మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడుతూ కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చాక అన్ని వర్గాలను మోసం చేశారని ధ్వజమెత్తారు. దేశ వ్యాప్తంగా వృద్దులకు రూ.200 పెన్షన్‌ ఇస్తే.. కేసీఆర్‌ రూ.2వేలిచ్చారని పేర్కొన్నారు. కేసీఆర్‌ కాలంలో 24 గంటలపాటు సాగుకు విద్యుత్‌ అందించారన్నారు. దేవన్నపేటలో ప్రారంభమైన ప్రదర్శన పలు ప్రాంతాల గుండా సాగింది. కార్యక్రంమలో కార్పొరేటర్‌ దివ్యారాణి, మాజీ కార్పొరేటర్‌ రాజునాయక్‌, పీఏసీఎస్‌ డైరెక్టర్‌ విజేందర్‌, మాజీ సర్పంచ్‌ రవి, భూపాల్‌, వాసుదేవరెడ్డి, గ్రామశాఖ అధ్యక్షుడు సదన్‌ తదితరులు పాల్గొన్నారు.

నేడు వేయిస్తంభాల

దేవాలయంలో

శనిత్రయోదశి పూజలు

హన్మకొండ కల్చరల్‌ : శ్రీరుద్రేశ్వరస్వామివారి వేయిస్తంభాల దేవాలయంలో శనివారం శనిత్రయోదశి, మాసశివరాత్రి పూజలు నిర్వహిస్తున్నట్లు ప్రధానార్చకుడు గంగు ఉపేంద్రశర్మ, ఈఓ అనిల్‌కుమార్‌ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. శనిత్రయోదశి, మాసశివరాత్రి ఒకేరోజు రావడం విశేషమని పేర్కొన్నారు. భక్తులు తమ శని దోష నివారణకుయ తిలదానం, తైలాభిషేకం, మహాశివరాత్రి సందర్భంగా స్వామివారికి అభిషేకం, కల్యాణోత్సవం నిర్వహిస్తామని తెలిపారు.

నేటితో ముగియనున్న

బార్ల దరఖాస్తుల గడువు

కాజీపేట అర్బన్‌ : గ్రేటర్‌ వరంగల్‌ పరిధిలో లైసెన్స్‌ రెన్యువల్‌ కాని నాలుగు బార్లకు దరఖాస్తు గడువు శనివారం(ఈనెల 26వ తేదీ)తో ముగియనున్నట్లు హనుమకొండ జిల్లా(వరంగల్‌ అర్బన్‌) ఎకై ్సజ్‌ సూపరింటెండెంట్‌ కె.చంద్రశేఖర్‌ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. దరఖాస్తులను ఆన్‌లైన్‌లో tgbcl. telangana. gov. in వెబ్‌సైట్‌లో లేదా దగ్గరలోని ఎకై ్సజ్‌ స్టేషన్‌లో నేరుగా అందజేయవచ్చునని పేర్కొన్నారు. వివరాలకు 0870–2577502 లేదా 87126 59019, 87120 59022, 87126 59021, 87126 59020 నంబర్లలో సంప్రదించాలని కోరారు.

ఎమ్మెస్సీ ఇంటిగ్రేటెడ్‌ కెమిస్ట్రీ

ఆరో సెమిస్టర్‌ పరీక్షలు వాయిదా

కేయూక్యాంపస్‌: కాకతీయ యూనివర్సిటీ పరిధిలో ఐదేళ్ల ఎమ్మెస్సీ ఇంటిగ్రేటెడ్‌ కెమిస్ట్రీ మూడో సంవత్సరం విద్యార్థులకు ఈనెల 26నుంచి జరగాల్సిన ఆరో సెమిస్టర్‌ పరీక్షలు వాయిదా వేసినట్లు పరీక్షల నియంత్రణాధికారి కె.రాజేందర్‌, అదనపు పరీక్షల నియంత్రణాధికారి సౌజన్య శుక్రవారం తెలిపారు. జూన్‌ 6వ తేదీనుంచి ఆయా పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఈనెల 30వ తేదీలోపు ఆయా విద్యార్థులకు ప్రయోగపరీక్షలు పూర్తిచేయాలని కోరారు.

దరఖాస్తు గడువు పెంపు

వరంగల్‌ స్పోర్ట్స్‌: హనుమకొండ జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో మే1 నుంచి 31వ తేదీ వరకు నిర్వహించనున్న వేసవి క్రీడా శిక్షణ శిబిరాల్లో పాల్గొనేందుకు దరఖాస్తు తేదీని ఈ నెల 28 వరకు పొడిగించినట్లు డీవైఎస్‌ఓ గుగులోత్‌ అశోక్‌కుమార్‌ ఒక ప్రకటనలో తెలిపారు. 25 క్రీడాంశాల్లో అందించనున్న శిక్షణకు దరఖాస్తుకు 25 చివరి తేదీ కాగా మరో మూడు రోజులు పొడిగించినట్లు పేర్కొన్నారు. విద్యార్థులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, పూర్తి వివరాలకు 97046 69637 మొబైల్‌ నంబర్‌లో సంప్రదించాలని కోరారు.

మలేరియా నివారణపై

అవగాహన కల్పించాలి

ఎంజీఎం : మలేరియా నివారణపై ప్రజల్లో విస్తృతంగా అవగాహన కల్పించి వివిధ శాఖల సమన్వయంతో వ్యాధి నిర్మూలనకు పాటుపడాలని హనుమకొండ జిల్లా అదనపు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి, ఇన్‌చార్జ్‌ జిల్లా మలేరియా అధికారి డాక్టర్‌ మదన్‌ మోహన్‌ రావు ఆరోగ్య సిబ్బందికి సూచించారు. ప్రపంచ మలేరియా దినోత్సవం పురస్కరించుకొని శుక్రవారం వడ్డెపల్లి పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీని ఆయన జెండా ఊపి ప్రారంభించారు.

42.4

సీరోలు (మానుకోట)

42.9

ములుగు రోడ్డు

42.8

జఫర్‌గడ్‌

43.2

కన్నాయిగూడెం

42.5

ములుగు

ఎంజీఎం : వేసవి ఎండల తీవ్రత ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ తప్పకుండా జాగ్రత్తలు పాటించాలని డాక్టర్‌ ఎం.పవన్‌కుమార్‌ ప్రజలకు సూచించారు. ఎండాకాలం తీసుకోవాల్సిన పలు జాగ్రత్తల గురించి ఆయన పలు సూచనలు చేశారు.

● అవసరమైతే తప్ప ఉదయం 11 నుంచి 4 గంటల వరకు ఎండలో బయట తిరగకపోవడం మంచిది.

● తేలిగ్గా ఉండే కాటన్‌ దుస్తులు ధరించాలి. రోజుకి 10 నుంచి 12 గ్లాసుల నీళ్లు తాగాలి

● మజ్జిగ, నిమ్మరసం, కొబ్బరి నీళ్లు తీసుకోవాలి. నీటిశాతం ఎక్కువగా ఉండే పుచ్చకాయ, కర్బుజా తినాలి.

● ఆహారంలో మసాలా, ఉప్పు తగ్గించి వాడాలి. రోజుకు రెండు సార్లు స్నానం చేయడం మంచిది.

● వృద్ధులు అత్యవసరమైతే తప్ప ఎండలో తిరగరాదు. బీపీ, షుగర్‌ రెగ్యులర్‌గా చెక్‌ చేసుకోవాలి.

● కొన్ని రకాల మాత్రలు (డియురేటిక్స్‌, ఎస్‌జీఎల్‌టీ 2 ఇన్‌హిబిటర్స్‌) వల్ల శరీరంలో నీటి నిల్వలు తగ్గే అవకాశం ఉంది.

● తలనొప్పి, తల తిరగడం, వాంతులు ఉన్నట్లయితే ఎండదెబ్బ తగిలినట్టుగా భావించి డాక్టర్‌ సలహా తీసుకోవాలి.

● డయాబెటిక్‌ రోగులు క్రమం తప్పకుండా మందులు వాడుతూ, రెగ్యులర్‌గా షుగర్‌ పరీక్షలు చేయించుకోవాలి.

● డాక్టర్‌ సలహా లేకుండా మందులు మానేయరాదు.

● గర్భిణులు నీరు, ఆహారం, పండ్లు తగిన మోతాదులో తీసుకోవాలి.

– డాక్టర్‌ ఎం.పవన్‌కుమార్‌, ఎండీ, ప్రొఫెసర్‌ ఆఫ్‌ మెడిసిన్‌, గవర్నమెంట్‌ మెడికల్‌ కాలేజీ, భూపాలపల్లి

ఉమ్మడి జిల్లాలో రోజురోజుకూ

పెరుగుతున్న ఉష్ణోగ్రతలు

మ్మడి వరంగల్‌ జిల్లాలో రోజురోజుకూ ఎండలు మండుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో ఏకంగా 43 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. శుక్రవారం ఉమ్మడి జిల్లా పరిధిలోని పలు ప్రాంతాల్లో 42నుంచి 43.8డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కోల్‌బెల్ట్‌ ఏరియా అయిన జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలో మే నెలలో 46డిగ్రీలకుపై బడి ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణశాఖ నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రజలు ఉదయం 10 గంటలు దాటితే అత్యవసరమైతేనే బయటికి వెళ్లాలని చెబుతున్నారు. ముఖ్యంగా వృద్ధులు, పిల్లలు ఆరోగ్యంపట్ల జాగ్రత్తగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. ఇదే సమయంలో మూగజీవాలు, పక్షులకు తాగునీటి వసతి కల్పించాలి. ఇప్పుడు ప్రతి నగరం, పట్టణ కేంద్రాల్లో రూఫ్‌గార్డెన్లతో ఇంటికి అవసరమైన కూరగాయలు పండిస్తున్నారు. వారు ఎండవేడికి మొక్కలు ఎండిపోకుండా జాగ్రత్త పడాలి. దీంతోపాటు ప్రతి ఇంట్లో ద్విచక్రవాహనం ఉంటుంది. మధ్యతరగతి, ఆపై ఉన్నత కుటుంబాల వారు కారు మెయింటెన్‌ చేస్తుంటారు. మండే ఎండలకు వీటి నిర్వహణ బాగుంటేనే మన ప్రయాణాలు సాఫీగా సాగుతాయి. ఈ నేపథ్యంలో వేసవిని ఎదుర్కొనేందుకు వైద్యులు, వ్యవసాయశాస్త్రవేత్తలు, పశువైద్యాధికారులు చెబుతున్న సూచనలు, సలహాలు మీకోసం..

ఇప్పటికే 43 డిగ్రీలు దాటిన వైనం

వృద్ధులు, పిల్లలు జాగ్రత్తగా ఉండాలంటున్న వైద్యులు

పక్షులు, పశువులకు తాగునీరు

అందుబాటులో ఉంచుదాం..

వాహనాల బ్యాటరీపై అధిక లోడ్‌

ఉండకుండా చూసుకోవాలి..

ఆయా రంగాల నిపుణుల సలహాలు, సూచనలు

– ఎండీ జాఫర్‌, సీనియర్‌ మెకానిక్‌

ఖిలా వరంగల్‌: వేసవిలో ఏ వాహనమైన ఇంధనాన్ని పూర్తిగా నింపొద్దు. ఎండ వేడికి ఇంజన్‌ ఆయిల్‌ త్వరగా పలుచబడిపోతుంది. నిర్ణీత సమయానికి ఇంజనాయిల్‌ను మార్చుకోవడం మంచిది. వాహన పెట్రోలు ట్యాంకుపై మందం కవర్‌ ఉండేలా చూసుకోవాలి. సీట్ల కవర్లు సాధారణమైనవి. అయితే త్వరగా వేడెక్కి మన ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. అందుకు ప్రత్యామ్నాయంగా వేడి కాకుండా ఉండేందుకు వెలివేట్‌ క్లాత్‌ వంటి సీటు కవరును వాడాలి. ఎండలో ఎక్కువ సమయం పార్కింగ్‌ చేసి ఉంచితే ద్విచక్రవాహనాలు దెబ్బతింటాయి. ఇంజన్‌లో మంటలు వస్తాయి. టైర్లు పేలుతాయి. ఎప్పటికప్పుడు కూలెంట్‌ ఆయిల్‌ చెక్‌చేసుకోవాలి. దూరప్రయాణం చేయాల్సిన వారు మధ్య మధ్యలో వాహనాలను ఆపి 15 నుంచి 20 నిమిషాల పాటు విశ్రాంతి తీసుకోవడం మంచిది. ఇలా చేయడం వల్ల వాహన ఇంజన్‌ వేడి తగ్గి కూల్‌ అవుతుంది. వాహనాలను ఎక్కువ సేపు పార్కింగ్‌ చేయాల్సి వస్తే చెట్టునీడన, షెడ్లలో పార్కింగ్‌ చేయడం మంచిది. మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 4 గంటల సమయంలో బైక్‌ ప్రయాణం చేయకపోవడం చాలా మంచిది. ఎండ వేడికి టైర్లు మెత్తబడి గాలి తగ్గి, బైక్‌ మధ్యలోనే ఆగిపోతుంది. ఒక్కోసారి బైక్‌ టైర్లు పేలి అదుపు తప్పి ప్రమాదం జరిగే ఆస్కారం ఉంది. వేసవిలో వాహనాల్లో బ్యాటరీపై ఎక్కువ లోడ్‌ పడుతుంది. ఇదే సమయంలో అధిక ఉష్ణోగ్రతలు, పరిమితికి మించి వాహనంలో ఎలక్ట్రికల్‌ ఉపకరణాలను బిగించడం వల్ల షార్ట్‌ సర్క్యూట్‌కు ఆస్కారం ఉంటుంది.

చిన్న పిల్లల్లో హీట్‌ స్ట్రోక్‌

– డాక్టర్‌ సుధాకర్‌, పిడియాట్రిషన్‌

ఎంజీఎం : హీట్‌ స్ట్రోక్‌ (ఎండదెబ్బ) వల్ల ఎండాకాలంలో పిల్లలు బాగా ఇబ్బందులు పడుతుంటారు. ఎక్కువగా ఎండలో తిరిగేవారు, శుభకార్యాలకు వెళ్లేవారు, ఇంటి ఆవరణలో ఎండలో, ఆట స్థలంలో తిరిగే పిల్లలకు ఎక్కువగా హీట్‌ స్ట్రోక్‌కు గురవుతారు.

హీట్‌ స్ట్రోక్‌ లక్షణాలు..

● శరీరం బాగా వేడెక్కడం. వాంతులు, విరోచనాలతో శరీరంలో నీటిశాతం పడిపోతుంది

● పిల్లలకు మూత్రం సరిగ్గా రాకపోవడం, ఎర్రగా రావడం. ఎండలో తిరిగే పిల్లలు తొందరగా అలిసిపోవడం, తలనొప్పి, శరీరంలో నొప్పులు, నరాల బలహీనత , తీవ్ర అస్వస్థతతో కోమాలోకి వెళ్తారు.

● పసిపిల్లలు డల్‌గా ఉంటారు. బరువు తగ్గడం, పాలు సరిగ్గా తాగకపోవడంలాంటి లక్షణాలు ఉంటాయి.

● అందుకే పిల్లలు ఎండలో ఎక్కువగా తిరగకుండా ఉండాలి. ప్రయాణాలు తగ్గించుకోవాలి.

● పిల్లలు ఎక్కువగా నీళ్లు తాగాలి. ఓఆర్‌ఎస్‌ తాగించాలి.

● వదులుగా ఉండే కాటన్‌ దుస్తులు ధరింపజేయాలి.

మూగజీవాలకు

తాగునీరు అందిద్దాం

– నాగ ప్రసాద్‌, పశువైద్యాధికారి, బచ్చన్నపేట

జనగామ: వేసవి ఉష్ణోగ్రతలు 43 డిగ్రీల వరకు పెరిగాయి. ఎక్కడా కుళాయిలు అందుబాటులో లేవు. ఇలాంటి పరిస్థితుల్లో పెంపుడు కుక్కలు, వీధి కుక్కలు, పక్షుల దాహార్తి తీర్చేందుకు ప్రతి ఒక్కరూ స్పందించాలి. ప్రభుత్వంతో పాటు ప్రజలు భాగస్వాములు కావాలి. కుక్కలు, పక్షులు గొంతెండి మృత్యువాత పడకుండా ఇంటి ఆవరణ, భవనాల ముందు, ప్రధాన కూడళ్లలో నీటితొట్లు ఏర్పాటు చేసి ఎప్పుడూ తాగునీరు నిల్వ ఉండేలా చూసుకోవాలి. ముఖ్యంగా పక్షులకు ఇంటిదాబా పైన తొట్టిలాంటి మట్టిపాత్రలు ఉంచి ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం నీటిని పోస్తూ ఉండాలి. వాటికి దాహం వేసిన సమయంలో అలవాటుగా రోజూ అక్కడికి వచ్చి దాహం తీర్చుకుంటాయి. వరంగల్‌ మహానగరంలో అయితే బల్దియా ఆధ్వర్యంలో సుమారు 300 చోట్ల నీటితొట్టెలు ఏర్పాటు చేస్తున్నారు. ఇలాగే అన్ని మున్సిపాలిటీ కేంద్రాల్లో ఏర్పాటుచేస్తే మంచిది. గ్రామాల్లో రోడ్ల వెంట గతంలో నీటితొట్లు ఏర్పాటుచేశారు. వాటిని శుభ్రం చేసి గ్రామ పంచాయతీవారు నీటిని నింపి పెట్టాలి.

ప్రతీ ఇంట్లో ఎర్త్‌ వైరింగ్‌ ఏర్పాటుచేసుకోవాలి

– కూరాకుల పాల్‌, ఎలక్ట్రీషియన్‌

నెహ్రూసెంటర్‌: ఇళ్లలో వినియోగించే ఎలక్ట్రానిక్‌ వస్తువుల పట్ల జాగ్రత్తలు పాటించాలి. ఇంట్లో వాడుకునే ఫ్రిజ్‌, టీవీ, ఏసీ, కూలర్‌, ఫ్యాన్‌, వంటి వాటిని పిల్లలు ముట్టుకోకుండా చూసుకోవాలి. దీంతో పాటు వేసవిలో విద్యుత్‌ సరఫరా, అంతరాలు జరిగినప్పుడు, వడ గాలుల వల్ల విద్యుత్‌ వైర్లు తెగినప్పుడు వాటిని సరి చేసుకునే వరకు ఎలక్ట్రానిక్‌ వస్తువులను వినియోగించొద్దు. సొంతంగా ఎలక్ట్రీషియన్‌ పనులు చేయవద్దు. అకాల వర్షాల కారణంగా వర్షాలు, ఉరుములు, మెరుపులు, పిడుగులు పడిన సమయంలో షార్ట్‌ సర్క్యూట్‌ జరిగి ఎలక్ట్రానిక్‌ వస్తువులను కాలిపోయే ప్రమాదం ఉంటుంది. అలాంటి సమయంలో ఎలక్ట్రానిక్‌ వస్తువులను వినియోగించకూడదు. ఇంట్లో వస్తువులను ఏర్పాటు చేసుకున్నప్పుడు తప్పకుండా ఎర్త్‌ వైరింగ్‌ చేయాలి. చార్జింగ్‌ తీసిన తర్వాత ఫోన్‌ వినియోగించుకోవాలి. ఇంట్లో ఎలక్ట్రానిక్‌ వస్తువులు ఎక్కువగా వాడితే మంచి క్వాలిటీ కలి గిన విద్యుత్‌ వైర్లను వినియోగించాలి. ఇంటి ఆవరణలో ఇనుప తీగలతో దండాలు కట్టుకోవద్దు. దీని వల్ల విద్యుత్‌ ప్ర మాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. ఇంట్లో ఎలక్ట్రానిక్‌ వస్తువులు పాడైతే మెకానిక్‌, ఎలక్ట్రీషియన్‌కు చూపించాలి.

న్యూస్‌రీల్‌

ఉద్యాన పంటలకు ఎప్పుడూ తేమ ఉండాలి

వృద్ధులు, గర్భిణులు జాగ్రత్త..

వాహనాలు జరభద్రం..

జూనియర్‌ సివిల్‌ జడ్జిల బదిలీ

వరంగల్‌ లీగల్‌: ఉమ్మడి జిల్లాలో పలువురు జూనియర్‌ సివిల్‌ జడ్జిలను బదిలీ చేస్తూ హైకోర్టు రిజిస్ట్రార్‌ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. వరంగల్‌ ప్రిన్సిపల్‌ జూనియర్‌ సివిల్‌ జడ్జి చండీశ్వరదేవిని యాదాద్రి భువనగిరికి బదిలీ చేయగా.. ఆస్థానంలో మేడ్చల్‌ మల్కాజ్‌గిరి జిల్లా కుషాయిగూడ ప్రిన్సిపల్‌ జూనియర్‌ సివిల్‌ జడ్జి కె.పూజను నియమించారు. ఖాళీగా ఉన్న నర్సంపేట ప్రిన్సిపల్‌ జూనియర్‌ సివిల్‌ జడ్జిగా రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్‌ రెండో జూనియర్‌ సివిల్‌ జడ్జి ఎస్‌.అంకిత్‌ను నియమించారు. హనుమకొండ జిల్లా పరకాల ప్రిన్సిపల్‌ జూనియర్‌ సివిల్‌ జడ్జి లింగం శాలినిని హైదరాబాద్‌ సిటీ సివిల్‌ కోర్టుకు బదిలీ చేయగా.. ఆస్థానంలో ఎల్‌బీనగర్‌ రెండో జూనియర్‌ సివిల్‌ జడ్జి జి.సాయిశరత్‌ను నియమించారు. మహబూబాబాద్‌ జిల్లా ప్రిన్సిపల్‌ జూనియర్‌ సివిల్‌ జడ్జిగా హైదరాబాద్‌కు చెందిన జూనియర్‌ సివిల్‌ జడ్జి ఎం.స్వాతిని నియమించారు. మహబూబాబాద్‌ జూనియర్‌ సివిల్‌ జడ్జి తిరుపతిని రెండో జూనియర్‌ సివిల్‌ జడ్జిగా మల్కాజ్‌గిరికి, ఆయన స్థానంలో హుస్నాబాద్‌ జూనియర్‌ సివిల్‌ జడ్జి ఆర్వపల్లి కృష్ణతేజ్‌ను నియమించారు. తొర్రూరు జూనియర్‌ సివిల్‌ జడ్జి మట్టా సరితను పెద్దపల్లి జిల్లా నందిమేడారం కోర్టుకు, ఆస్థానంలో షాద్‌నగర్‌ కోర్టుకు చెందిన జడ్జి ధీరజ్‌కుమార్‌ను నియమించారు. భూపాలపల్లి జిల్లా ప్రిన్సిపల్‌ జూనియర్‌ సివిల్‌ జడ్జి ఎన్‌.రాంచందర్‌రావును సిటీ సివిల్‌ కోర్టు హైదరాబాద్‌కు, ఆయన స్థానంలో మేడ్చల్‌ కోర్టుకు చెందిన జూనియర్‌ సివిల్‌ జడ్జి దిలీప్‌కుమార్‌నాయక్‌ను బదిలీ చేశారు. ములుగు జిల్లా ప్రిన్సిపల్‌ జూనియర్‌ సివిల్‌ జడ్జిగా నాగర్‌కర్నూల్‌ జిల్లా కొల్లాపూర్‌ జూనియర్‌ సివిల్‌ జడ్జి గుంటి జ్యోత్స్నను నియమించగా.. ములుగు జూనియర్‌ సివిల్‌ జడ్జి జె.సౌఖ్యను హైదరాబాద్‌కు బదిలీ చేశారు.

శనివారం శ్రీ 26 శ్రీ ఏప్రిల్‌ శ్రీ 202 1
1/15

శనివారం శ్రీ 26 శ్రీ ఏప్రిల్‌ శ్రీ 202

శనివారం శ్రీ 26 శ్రీ ఏప్రిల్‌ శ్రీ 202 2
2/15

శనివారం శ్రీ 26 శ్రీ ఏప్రిల్‌ శ్రీ 202

శనివారం శ్రీ 26 శ్రీ ఏప్రిల్‌ శ్రీ 202 3
3/15

శనివారం శ్రీ 26 శ్రీ ఏప్రిల్‌ శ్రీ 202

శనివారం శ్రీ 26 శ్రీ ఏప్రిల్‌ శ్రీ 202 4
4/15

శనివారం శ్రీ 26 శ్రీ ఏప్రిల్‌ శ్రీ 202

శనివారం శ్రీ 26 శ్రీ ఏప్రిల్‌ శ్రీ 202 5
5/15

శనివారం శ్రీ 26 శ్రీ ఏప్రిల్‌ శ్రీ 202

శనివారం శ్రీ 26 శ్రీ ఏప్రిల్‌ శ్రీ 202 6
6/15

శనివారం శ్రీ 26 శ్రీ ఏప్రిల్‌ శ్రీ 202

శనివారం శ్రీ 26 శ్రీ ఏప్రిల్‌ శ్రీ 202 7
7/15

శనివారం శ్రీ 26 శ్రీ ఏప్రిల్‌ శ్రీ 202

శనివారం శ్రీ 26 శ్రీ ఏప్రిల్‌ శ్రీ 202 8
8/15

శనివారం శ్రీ 26 శ్రీ ఏప్రిల్‌ శ్రీ 202

శనివారం శ్రీ 26 శ్రీ ఏప్రిల్‌ శ్రీ 202 9
9/15

శనివారం శ్రీ 26 శ్రీ ఏప్రిల్‌ శ్రీ 202

శనివారం శ్రీ 26 శ్రీ ఏప్రిల్‌ శ్రీ 202 10
10/15

శనివారం శ్రీ 26 శ్రీ ఏప్రిల్‌ శ్రీ 202

శనివారం శ్రీ 26 శ్రీ ఏప్రిల్‌ శ్రీ 202 11
11/15

శనివారం శ్రీ 26 శ్రీ ఏప్రిల్‌ శ్రీ 202

శనివారం శ్రీ 26 శ్రీ ఏప్రిల్‌ శ్రీ 202 12
12/15

శనివారం శ్రీ 26 శ్రీ ఏప్రిల్‌ శ్రీ 202

శనివారం శ్రీ 26 శ్రీ ఏప్రిల్‌ శ్రీ 202 13
13/15

శనివారం శ్రీ 26 శ్రీ ఏప్రిల్‌ శ్రీ 202

శనివారం శ్రీ 26 శ్రీ ఏప్రిల్‌ శ్రీ 202 14
14/15

శనివారం శ్రీ 26 శ్రీ ఏప్రిల్‌ శ్రీ 202

శనివారం శ్రీ 26 శ్రీ ఏప్రిల్‌ శ్రీ 202 15
15/15

శనివారం శ్రీ 26 శ్రీ ఏప్రిల్‌ శ్రీ 202

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement