
అంబేడ్కర్‌పై కాంగ్రెస్ మొసలి కన్నీరు
ఉపాధ్యాయ ఎమ్మెల్సీ మల్కా కొమురయ్య
ఖిలా వరంగల్: అంబేడ్కర్‌ను అడుగడుగునా అవమానించి, ఆయన ఆశయాలను తుంగలో తొక్కిన చరిత్ర కాంగ్రెస్ పార్టీదని టీచర్స్ ఎమ్మెల్సీ మల్కా కొమురయ్య ఆరోపించారు. అంబేడ్కర్ 134వ జయంతి ఉత్సవాల్లో భాగంగా వరంగల్ చింతల్ రోడ్డులోని సుష్మిత గార్డెన్‌లో బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంట రవికుమార్ అధ్యక్షతన జరిగిన జిల్లా స్థాయి సదస్సులో ఆయన మాట్లాడారు. అంబేడ్కర్‌పై కాంగ్రెస్ మొసలి కన్నీరు కారుస్తోందని ఆరోపించారు. ఆయన ఆశయాలను నెరవేర్చే దిశగా ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలోని కేంద్రం ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోదన్నారు. సమావేశంలో మాజీ మంత్రి గుండె విజయ రామారావు, ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు కొండేటి శ్రీధర్, జిల్లా అధ్యక్షుడు పోలేపాక మార్టిన్ లూథర్, నాయకులు రామిండ్ల బాబురావు, గడ్డం మహేందర్, జన్ను ఆరోగ్యం, రాజు, అనిత, రత్నం సతీశ్‌షా, డాక్టర్ వన్నాల వెంకటరమణ, బాకం హరిశంకర్, రాణా ప్రతాప్‌రెడ్డి, కార్యకర్తలు పాల్గొన్నారు.