జిల్లాల వారీగా ఇలా.. | - | Sakshi
Sakshi News home page

జిల్లాల వారీగా ఇలా..

Published Wed, Mar 26 2025 1:07 AM | Last Updated on Wed, Mar 26 2025 1:01 AM

● హనుమకొండ వడ్డేపల్లిలో అపార్ట్‌మెంట్‌ మోడల్‌లో 744 ఫ్లాట్లు నిర్మించారు. వీటిని 1990లో లబ్ధిదారులకు కేటాయించగా చాలా మంది క్రయవిక్రయాలు జరిపారు. ఇక్కడ రూ.3,67,81,668 బకాయిలు పేరుకుపోగా ఇప్పుడు 142 మందికి నోటీసులు జారీ చేశారు.

● వరంగల్‌ గొర్రెకుంట కాలనీలో 1376 ఇళ్లు నిర్మించారు. వీటిని దశల వారీగా 1992, 1993, 2003, 2012లో లబ్ధిదారులకు కేటాయించారు. ఈ కాలనీలో రూ.9,43,58,063 బకాయిలు పేరుకుపోగా వీటిని రాబట్టుకునేందుకు 103 మందికి నోటీసులు జారీ చేశారు.

● మహబూబాబాద్‌ జిల్లా మరిపెడలో 79 ఇళ్లు నిర్మించి 1997లో లబ్ధిదారులకు కేటాయించారు. ఇక్కడ రూ.7,19,45,743 బకాయిలు ఉండగా, వీటిని రాబట్టుకునేందుకు 64 మందికి నోటీసులు జారీ చేశారు.

● జనగామ హౌసింగ్‌ బోర్డు కాలనీలో 127 ఇళ్లు నిర్మించగా రూ.2,18,90,827 బకాయిలు పేరుకుపోయాయి. వీటిని రాబట్టుకునేందుకు 17 మందికి నోటీసులు జారీ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement