● మాజీ మంత్రి, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య
వరంగల్ చౌరస్తా : ఆజంజాహీ మిల్లు కబ్జాపై వరంగల్ తూర్పు మాజీ ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ స్పందించడం హాస్యాస్పదంగా ఉందని మాజీ మంత్రి, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య అన్నారు. సోమవారం వరంగల్ రాంకీలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వ పాలనలోనే ఆజంజాహి మిల్లు కబ్జా పురుడు పోసుకుందని విమర్శించారు. పదేళ్ల పాలనలో ప్రభుత్వ స్థలాలన్నీ కబ్జాకు గురయ్యాయని పేర్కొన్నారు. కార్పొరేషన్‌ను అదుపులో ఉంచుకొని ఇష్టం వచ్చినట్లుగా దొంగ కాగితాలను సృష్టించింది ఎవరని ప్రశ్నించారు. పది సంవత్సరాల పరిపాలనలో వరంగల్ మేయర్‌గా, ఎమ్మెల్యేగా వ్యవహరించి అనేక అక్రమాలకు పాల్పడ్డారని విమర్శించారు. పూటకో మాట రోజుకో వేషం వేసేవాడిని నేను కాదని స్పష్టం చేశారు. ఎవరి హయాంలో పర్మిషన్లు వచ్చాయని తేల్చుకుందామని సవాల్ విసిరారు. నమ్మిన ప్రజలను మోసం చేయడం నాకు రాదని, నిఖార్‌సైన రాజకీయాలు చేసే వాడిని తాను అని తెలిపారు. ప్రస్తుత ఎమ్మెల్యే , మాజీ ఎమ్మెల్యే కుమ్మక్కు అయ్యారా.. మరి ఎందుకు కార్మికుల కోసం పోరాటం చేయడం లేదని ప్రశ్నించారు.
సామాజిక సేవలో భాగస్వాములు కావాలి
● ఎమ్మెల్సీ శ్రీపాల్‌రెడ్డి
హసన్‌పర్తి : రెడ్డి సహకార పరపతి సంఘం సభ్యులు సామాజిక సేవా కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలని ఎమ్మెల్సీ శ్రీపాల్‌రెడ్ది పిలుపునిచ్చారు. రెడ్డి సహకార పరపతి సంఘం 15వ వార్షిక వేడుకలు గోపాలపురంలో సోమవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి శ్రీపాల్‌రెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ..తన గెలుపులో రెడ్డి సామాజిక వర్గం సభ్యులు కష్టపడ్డారని గుర్తుచేశారు. ఎమ్మెల్సీని ఘనంగా సన్మానించారు. సంఘం అధ్యక్షుడు కేతిరెడ్డి దామోదర్, విజేందర్‌రెడ్డి, మిర్యాల సతీష్ రెడ్డి, వంశీ రెడ్డి, శ్యాంసుందర్ రెడ్డి, పింగిలి విజయ్‌పాల్ రెడ్డి, పద్మ, కామడి సతీష్ రెడ్డి, మాలకొండ రెడ్డి, నాగిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా పదవివిమరణ పొందిన ఉద్యోగులను ఘనంగా సన్మానించారు.
నరేందర్ స్పందించడం హాస్యాస్పదం