● వరంగల్ ప్రజావాణిలో
పరిష్కారమైన వినతులు
వరంగల్: వరగల్ కలెక్టరేట్‌లో ఈనెల 10, 17వ తేదీల్లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమాల్లో వివిధ సమస్యలపై ప్రజలు వెయ్యి దరఖాస్తులు సమర్పించారు. అందులో 56 వినతులు మాత్రమే పరిష్కారమైనట్లు అధికార లెక్కలు చెబుతున్నా యి. గతంలో ఇచ్చిన వినతులు పరిష్కారం కాకపోవడంతో ప్రజలు పదే పదే అందజేస్తున్నారు.
‘కుడా’, పోలీస్ నో రెస్పాన్స్..
కాకతీయ అర్బన్ డెవలప్‌మెంట్(కుడా), పోలీసు శాఖలో వచ్చిన వినతులను అధికారులు పరిష్కరించడం లేదనే ఆరోపణలు వస్తున్నాయి. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని సమస్యలపై 202 మంది దరఖాస్తులు సమర్పించగా 10 మాత్రమే పరిష్కారమయ్యాయి. పోలీసు శాఖలో 123 సమర్పిస్తే మూడు, జెడ్పీలో 116 వస్తే రెండు, ‘కుడా’ పరిధిలో 107 వస్తే ఒకటి, నర్సంపేట ఏసీపీ పరిధిలో 45 వస్తే ఒకటి, ఈస్ట్‌జోన్ పోలీసు అధికారి పరిధిలో 43 వస్తే మొత్తం పెండింగ్‌లోనే ఉన్నాయి.
మూడు నెలలుగా వస్తున్నా..
ఉమ్మడి ఆస్తికి సంబంధించిన సమస్య పరిష్కరించాలని డిసెంబర్ 2న జరిగిన ప్రజావాణిలో వినతిపత్రం ఇచ్చాను. పరిష్కారం కాకపోవడంతో మళ్లీ వచ్చి ఈనెల 10న జరిగిన ప్రజావాణిలో ఫిర్యాదు చేశాను. అయినా అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోలేదు.
– చిలుక సుధాకర్, పైడిపల్లి
●
వెయ్యిలో 56 మాత్రమే!