
బెస్ట్ ఫ్రెండ్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆర్థిక సాయం
విద్యారణ్యపురి/హన్మకొండ చౌరస్తా: కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న హనుమకొండలోని కొత్తూరు జెండా ప్రాంతానికి చెందిన మార్త సంపత్‌కు బెస్ట్ ఫ్రెండ్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రూ.10వేలు ఆదివారం అందజేశారు. ఈసందర్భంగా ఫౌండేషన్ వ్యవస్థాపకుడు పులి దేవేందర్ మాట్లాడుతూ.. తమ ఫౌండేషన్ ద్వారా వివిధ సామాజిక సేవ కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. సంపత్ పిల్లలు బీ ఫార్మసీ, ఇంజనీరింగ్ చదువుతున్నారని తండ్రి అనారోగ్యంతో వారు ఉన్నత చదువులకు దూరం కాకుండా బెస్ట్ ఫ్రెండ్స్ ఫౌండేషన్ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. అనంతరం సంపత్ భార్య అనురాధ బెస్ట్ ఫ్రెండ్స్ ఫౌండేషన్ బాధ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. ఫౌండేషన్ బాధ్యులు వెంకటేశ్వర్లు, పొన్నం రాజు, చిరంజీవి, రాజు, విజయ్, కొండల్‌రెడ్డి, మధు, పతంగి భాస్కర్, బరిగెల భాస్కర్, బోనాల రమేష్, సుధాకర్ పాల్గొన్నారు.
ఆర్థిక చేయూత
ఖిలా వరంగల్: కరీమాబాద్ ఉర్సు బొడ్రాయి ప్రాంతానికి చెందిన స్వర్ణకారుడు రాగి సోమేశ్వరాచారీ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందాడు. బాధిత కుటుంబాన్ని ఆదివారం రాష్ట్ర విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ మాతృ సంఘం అధ్యక్షుడు వేములవాడ మదన్‌మోహన్, ప్రధాన కార్యదర్శి కృష్ణమాచార్యులు, రవీంద్రాచారి పరామర్శించారు. బాధిత కు టుంబానికి రూ.10వేలు, నిత్యావసర వస్తువులు అందజేశారు. సదానందం, వీరన్న, సత్యనారాయణ, పణికుమార్, సరిత, జగదీశ్వర్ పాల్గొన్నారు.