
చికెన్ వ్యర్థాల అడ్డగింత
మడికొండ: చికెన్ సెంటర్ నుంచి సేకరించిన వ్యర్థాలను వ్యాన్‌లో మడికొండలోని డంపింగ్ యార్డుకు తరలిస్తున్నట్లు సమాచారం అందగా అడహక్ కమిటీ సభ్యులు డంపింగ్ యార్డుకు చేరుకుని అడ్డుకున్నారు. వాహనదారుడిని నిలదీయగా సరైన సమాధానం ఇవ్వకపోవడంతో మున్సిపల్ అధికారులకు సమాచారం ఇచ్చా రు. దీంతో వాహనాలను తిరిగి మరో చోటుకు తరలించారు. ఎన్ని రోజుల నుంచి చికెన్ వ్యర్ధాలను వేస్తున్నారో తెలియడం లేదని అడ్‌హక్ కమిటీ సభ్యులు, ప్రజలు వాపోతున్నారు. అధి కారులు స్పందించి డంపింగ్ యార్డును ఇక్కడ నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు.
పనులు ప్రారంభించండి
హసన్‌పర్తి: వచ్చే నెల 27వ తేదీన దేవన్నపేటలో నిర్వహించనున్న బీఆర్‌ఎస్ బహిరంగ సభ పనులు ప్రారంభించాలని మాజీ మంత్రి దయాకర్‌రావు సూచించారు. బహిరంగ సభ నిర్వహించనున్న ప్రదేశాన్ని మాజీ మంత్రి దయాకర్‌రావు, మాజీ చీఫ్ విప్ దాస్యం వినయ్‌భాస్కర్, మాజీ ఎమ్మెల్యేలు పెద్ది సుదర్శన్, చల్లా ధర్మారెడ్డి ఆదివారం సందర్శించారు. ఈసందర్భంగా పార్కింగ్, సమావేశపు వేదిక ప్రాంతాలను పరిశీలించారు. కార్యక్రమంలో కార్పొరేటర్ దివ్యారాణి, నాగుర్ల వెంకటేశ్వర్లు, నాయకులు ఏనుగుల రాకేష్‌రెడ్డి, చింతం సదానందం, రాజునాయక్, బండి రజనీకుమార్, రవి, రఘు, పావుశెట్టి శ్రీధర్ పాల్గొన్నారు.
సందీప్‌కుమార్‌కు డాక్టరేట్
కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీ జియాలజీ విభాగం పరిశోధకుడు సందీప్‌కుమార్‌కు యూనివర్సిటీ డాక్టరేట్‌ను ప్రకటించింది. ఆ విభాగం ప్రొఫెసర్ మల్లికార్జున్‌రెడ్డి పర్యవేక్షణలో సందీప్ కుమార్ తన పీహెచ్‌డీ పూర్తిచేసినట్లు కేయూ పరీక్షల నియంత్రణాధి కారి ఆచార్య రాజేందర్ పేర్కొన్నారు.
చైతన్యడీమ్డ్ వర్సిటీనుంచి..
కేయూ క్యాంపస్: హైదరాబాద్‌లోని చైతన్య డీమ్డ్ యూనివర్సిటీ హనుమకొండకు చెందిన మహ్మద్‌ముఖీద్‌కు డాక్టరేట్‌ను ప్రకటించింది. మహ్మద్ ముఖీద్ ప్రొఫెసర్ నర్సింహాస్వామి పర్యవేక్షణలో తన పరిశోధన పూర్తిచేశారు. ఈనెల 22న హైదరాబాద్‌లోని చైతన్య డీమ్డ్ యూనివర్సిటీ స్నాతకోత్సవంలో మహ్మద్ ముఖీద్ డాక్టరేట్ పట్టా అందుకున్నారు.
బొడ్రాయికి పూజలు
ఖిలా వరంగల్: వరంగల్ ఎస్‌ఆర్‌ఆర్‌తోటలో ఆదివారం గ్రామదేవత శ్రీలక్ష్మీ, భూలక్ష్మి బొ డ్రాయి ప్రథమ వార్షికోత్సవం వైభవంగా జరి గింది. బొడ్రాయి ప్రతిష్టాపన కమిటీ అధ్యక్ష, కార్యదర్శులు తాటిపాముల భిక్షపతి, చిలువే రు రవీందర్, బండారి పూర్ణచందర్ ఆధ్వర్యంలో గ్రామ దేవత బొడ్రాయికి పూజలు నిర్వహించారు. బొడ్రాయి ప్రథమ వార్షికోత్సవానికి ప్రజలు పెద్దఎత్తన తరలివచ్చి పూజలు చేశా రు. ముఖ్యఅతిథులుగా కార్పొరేటర్లు పద్మ, ర వి, అరుణ, సుధాకర్, మాజీ కార్పొరేటర్ వేణు , నాయకులు కుమారస్వామి, శంకర్ హాజరయ్యారు. బొడ్రాయి ఉత్సవాల ఆదాయ లావా దేవీల పుస్తకాన్ని ఆవిష్కరించారు.
పొదుపుతో ఉపయోగం
వరంగల్: ప్రతి వ్యక్తి కుటుంబ ఆర్థిక అవసరాలకు పొదుపు ఎంతో ఉపయోగపడుతుంద ని కాశిబుగ్గలోని యునైటెడ్ ఫైనాన్స్ కార్పొరేషన్ అధ్యక్షుడు, కార్పొరేటర్ గుండేటి నరేంద్రకుమార్ అన్నారు. ఆదివారం సంఘం 40వ సర్వసభ్య వార్షికోత్సవ సమావేశం తిలక్‌రోడ్‌లోని కేవీఎస్ గార్డెన్స్‌లో జరిగింది. రామ రమేష్, ప్రకాష్, థామస్, రామకృష్ణ, శ్వేతాబాబు, భాస్కర్, రాజు, స్వామి పాల్గొన్నారు.
‘కార్మికులను మోసం
చేసింది కాంగ్రెస్ నాయకులే’
నయీంనగర్: అజాంజాహి మిల్లు కార్మికులు ఎక్కడ కోరితే అక్కడ స్థలం ఇస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందని వరంగల్ తూర్పు మాజీ ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ విమర్శించారు. ఆదివారం హనుమకొండ బీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన సమావేశంలో నరేందర్ మాట్లాడుతూ అజాంజాహి మిల్లు స్థలాలనే ఇస్తామని కార్మికులను నమ్మించి ఎన్నికల్లో ఓట్లు వేయించుకొని మోసం చేశారన్నారు. 2015లో కొండా సురేఖ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఎంఆర్‌ఓ ద్వారా సర్వే నంబర్ మార్చారన్నారు. కార్మిక భవనం సర్వే నంబర్ మార్చి గొట్టిముక్కల నరేష్ రెడ్డికి అప్పగించారని, మున్సిపల్ పరిధిలో ఇంటి నంబర్ ఉన్న భవనాన్ని మ్యుటేషన్ చేసిన ఎంఆర్‌ఓపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రస్తుత ఎమ్మెల్సీ బస్వరాజ్ సారయ్య.. ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే కాంగ్రెస్ హయాంలో అజాంజాహీ మిల్లు మూతపడిందన్నారు.

చికెన్ వ్యర్థాల అడ్డగింత

చికెన్ వ్యర్థాల అడ్డగింత