
పునరుద్ధరణ పనులు పూర్తి చేయాలి
ఖిలా వరంగల్: అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద కొనసాగుతున్న వరంగల్ రైల్వేస్టేషన్ పునరుద్ధరణ పనులను శరవేంగా పూర్తి చేయాలని దక్షణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్‌కుమార్ జైన్ అధికారులకు ఆదేశించారు. శుక్రవారం వరంగల్ రైల్వేస్టేషన్‌ను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా అమృత్ భారత్ స్టేషన్ స్కిమ్ (ఎబీఎస్‌ఎస్) కింద రూ.25.41కోట్లలో జరుగుతున్న పాదచారుల వంతెన(ఫుట్ ఓవర్ బ్రిడ్జి), 3 లిఫ్టులు, 4 ఎస్కలేటర్లు, లిఫ్ట్‌లు, గ్రీనరీ పనులను పరిశీలించారు. అంతకు ముందుగా రైల్వే కోచ్ రెస్టారెంట్‌ను తిలకించారు. అనంతరం జీర్పీ పోలీసులకు నూతన భవనం నిర్మించాలని జీఎంకు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో డీఆర్‌ఎం భరతేష్‌కుమార్, సీనియర్ డీసీఎం బాలాజీ కిరణ్, స్టేషన్ మేనేజర్ బాలరాజ్‌నాయక్, సీసీఐ రాజగోపాల్, ఆర్పీఎఫ్ సీఐ సీఎస్ ఆర్ కృష్ణ, జీర్పీ సీఐ సురేందర్, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.
జీఎం అరుణ్‌కుమార్ జైన్