
బాలికా సంరక్షణకు మరిన్ని కార్యక్రమాలు
హనుమకొండ కలెక్టర్ ప్రావీణ్య
హన్మకొండ అర్బన్ : సమాజంలో బాలికా సంరక్షణ కోసం మరిన్ని కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు హనుమకొండ కలెక్టర్ ప్రావీణ్య తెలిపారు. బేటీ బచావో – బేటీ పఢావో కార్యక్రమం పదేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా జిల్లా సంక్షేమశాఖ ఆధ్వర్యంలో శుక్రవారం వరంగల్ పోలీస్ కమిషనరేట్ నుంచి హనుమకొండ కలెక్టరేట్ వరకు మహిళా పోలీసులు, ఉద్యోగులు బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం కలెక్టర్ ప్రావీణ్య మాట్లాడుతూ బాలికా సంరక్షణ కార్యక్రమాలను సమాజంలో మరింత ముందుకు తీసుకెళ్లాలన్నారు. కార్యక్రమంలో జిల్లా సంక్షేమశాఖ అధికారి జయంతి, డీఆర్‌డీఏ పీడీ మేన శ్రీను, డీఎంహెచ్‌ఓ అప్పయ్య, డెమో అశోక్‌రెడ్డి, షీ టీమ్, భరోసా ఇన్‌స్పెక్టర్లు సుజాత, సువర్ణ, యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్ ఇన్‌స్పెక్టర్ వెంకన్న, సీడీపీఓ విశ్వజ పాల్గొన్నారు.