● అదనపు కలెక్టర్ సంధ్యారాణి
హసన్‌పర్తి : ప్రకృతి వైపరీత్యాలను ఎదుర్కొని ప్రజలకు సేవలందించే విధంగా ఆపద మిత్రలకు పరిపూర్ణమైన శిక్షణ ఇవ్వాలని వరంగల్ జిల్లా అదనపు కలెక్టర్ సంధ్యారాణిి పేర్కొన్నారు. మండల కేంద్రంలోని సంస్కృతీ విహార్‌లో వరంగల్ జిల్లాకు సంబంధించిన ఆపదమిత్ర పథకం ద్వారా ఎంపికై న 120 మంది వలంటీర్లకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమానికి సంధ్యారాణి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. కార్యక్రమంలో డీఆర్‌ఓ విజయలక్ష్మి, జిల్లా అగ్నిమాపక నియంత్రణ అఽధికారి సతీష్, జిల్లా ప్రణాళిక అధికారి గోవింద్ తదితరులు పాల్గొన్నారు.
తెలుపు మచ్చలుంటే
నిర్లక్ష్యం వద్దు
● డీఎంహెచ్‌ఓ అప్పయ్య
ఎంజీఎం : శరీరంపై స్పర్శ లేని తెలుపు మచ్చలుంటే నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యసిబ్బందిని కలిసి పరీక్షించుకోవాలని జిల్లా వైద్యాధికారి అప్పయ్య ప్రజలకు సూచించారు. కుష్ఠు లక్షణాలు కలిగిన వారిని గుర్తించేందుకు లెప్రసీ కేస్ డిటెక్షన్ క్యాంపెయిన్ (ఎల్‌సీడీసీ) ఇంటింటి సర్వేను సోమవారం అప్పయ్య బాలసముద్రంలో ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సమాజంలో వివక్షకు గురవుతామన్న ఆలోచనతో బయటకు చెప్పకపోవడంతో వ్యాధి ముదురుతోందని అన్నారు. స్పర్శ లేని మచ్చలు ఉన్న వారు స్వచ్ఛందంగా వచ్చి మొదట్లో చికిత్స తీసుకుంటే వ్యాధి పూర్తిగా నయమయ్యే అవకాశం ఉందని తెలియజేశారు. జిల్లాలోని 17 పీహెచ్‌సీలు, 7 యూపీహెచ్‌సీ పరిధిలో కుష్ఠు సోకిన వారిని గుర్తించేందుకు ఆశ కార్యకర్తల ద్వారా ఈనెల 31వ తేదీ వరకు ఇంటింటి సర్వే నిర్వహించనున్నట్లు, అనంతరం బాధితులకు చికిత్స అందిస్తారని తెలిపారు. కార్యక్రమంలో అదనపు డీఎంహెచ్‌ఓ డాక్టర్ టి.మదన్‌మోహన్‌రావు, వైద్యాధికారి గీత, వి.అశోక్‌రెడ్డి, హెల్త్ ఎడ్యుకేషన్ ఎస్.శ్రీనివాస్, డీపీఎంఓ సతీష్‌రెడ్డి, సూపర్‌వైజర్ బజిలి సమ్మ, విప్లవ్‌కుమార్, రాజేష్, ఏఎన్‌ఎం అరుణ, ఆశకార్యకర్తలు స్వప్న, అరుణ, తదితరులు పాల్గొన్నారు.
పరిపూర్ణమైన శిక్షణ ఇవ్వాలి