కీర్తి ప్రతిష్టలు తీసుకురావాలి | - | Sakshi
Sakshi News home page

కీర్తి ప్రతిష్టలు తీసుకురావాలి

Feb 20 2024 1:18 AM | Updated on Feb 20 2024 1:18 AM

- - Sakshi

సీపీ అంబర్‌ కిషోర్‌ ఝా

వరంగల్‌ క్రైం : వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌కు కీర్తి ప్రతిష్టలు తీసుకువచ్చేలా శిక్షణను విజయవంతంగా పూర్తి చేసుకోవాలని సీపీ అంబర్‌ కిషోర్‌ ఝా శిక్షణ కానిస్టేబుళ్లుకు సూచించారు. సోమవారం శిక్షణకు ఎంపికై న కానిస్టేబుళ్లతో సీపీ సమావేశం నిర్వహించారు. వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో నిర్వహించిన కానిస్టేబుళ్ల నియామకాల్లో మొత్తం 658 మంది ఎంపికయ్యారని, 472 మంది పురుషుల్లో 291 మంది సివిల్‌, 181ఆర్మ్‌డ్‌ రిజర్వ్‌ కానిస్టేబుళ్లు, 196 మంది మహిళల్లో 141 మంది మహిళా సివిల్‌, 45 మంది ఆర్మ్‌డ్‌ రిజర్వ్‌ కానిస్టేబుళ్లు ఉన్నారని తెలిపారు. వీరికి తెలంగాణ పోలీస్‌ అకాడమీతో పాటు పీటీసీ అంబర్‌పేట, మేడ్చల్‌, యూసుఫ్‌గూడ బెటాలియన్‌లలో తొమ్మిది నెలల పాటు శిక్షణ ఉంటుందని సీపీ వివరించారు. కార్యక్రమంలో అదనపు డీసీపీ రాగ్యా నాయక్‌, ఏసీపీ అనంతయ్య, ఆర్‌ఐలు స్పర్జన్‌, శ్రీధర్‌ తదితరులు పాల్గొన్నారు.

ప్రతిభను వెలికితీసేందుకు పోటీలు

విద్యారణ్యపురి: విద్యార్థుల్లో దాగిఉన్న ప్రతిభను వెలికితీసేందుకు డ్రామా పోటీలు దోహదపడుతాయని జిల్లా డీఈఓ కార్యాలయ కమ్యూనిటీ మొబలైజింగ్‌ కోఆర్డినేటర్‌ బి.రాధ అన్నారు. సోమవారం హనుమకొండ జిల్లాలోని ముచ్చర్ల మిలీనియం పాఠశాలలో ఉమ్మడి వరంగల్‌ జిల్లా స్థాయి డ్రామా పోటీలు నిర్వహించారు. ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌ టీచర్స్‌ అసోసియేషన్‌(ఎల్టా) ఆధ్వర్యంలో ప్రభుత్వ, జిల్లా పరిషత్‌, కేజీబీవీ, మోడల్‌ స్కూల్స్‌, టీఎస్‌ఆర్‌ఎస్‌కు చెందిన విద్యార్థులు డ్రామా పోటీల్లో అద్భుత ప్రదర్శనలిచ్చారు.ఈ సందర్భంగా రాధ ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. ఇంగ్లిష్‌ ప్రపంచ భాషగా మారిందని అందుకు విద్యార్థులు సైతం ఆంగ్లంపై పట్టు సాధించాలన్నారు. కార్యక్రమంలో ఎల్టా రాష్ట్ర అధ్యక్షుడు టి. వెంకటేశ్వర్‌రావు, అసోసియేట్‌ అధ్యక్షుడు పూల శ్రీనివాస్‌, హనుమకొండ, వరంగల్‌ జిల్లాల అధ్యక్షులు పి.సంపత్‌ కుమార్‌, వి.లక్ష్మణ్‌, ఆర్గనైజర్‌ కె.రవికుమార్‌ ఉపాధ్యాయులు పాల్గొన్నారు. కాగా జిల్లాస్థాయి డ్రామా పోటీల్లో ప్రతిభను చూపిన విద్యార్థులు ఈనెల26వ తేదీన జరిగే రాష్ట్రస్ధాయి డ్రామా పోటీలకు ఎంపికయ్యారు.

మాట్లాడుతున్న సీపీ అంబర్‌ కిషోర్‌ ఝా 1
1/1

మాట్లాడుతున్న సీపీ అంబర్‌ కిషోర్‌ ఝా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement