
మహిళలు తయారు చేసిన శివ లింగాలు
కాజీపేట రూరల్: కాజీపేట రైల్వే దేవాలయ సముదాయంలో మహిళాభక్త బృందం లక్షా యాబై వేల శివలింగాలను తయారు చేసి దైవభక్తిని చాటారు. రైల్వే ఆలయ అర్చకుడు అర్వపల్లి ఆంజనేయశాసీ్త్ర, రైల్వే కమిటీ సెక్రటరీ పి.భాస్కర్‌రావు, సభ్యులు ఎఎస్‌ఆర్.ప్రసాదరావు, నర్ర భాస్కర్, పరశురాం సహకారంతో మహిళా భక్తులు అయిత పుష్పలత, పద్మావతి, విజయలక్ష్మి, ఆర్.లక్ష్మీమురళి, సంధ్య, పెండ్యాల రత్నమాల, జ్యోతి, పిట్టల శారద, కె.రాజు.. శివలింగాలను తయారు చేస్తున్నారు. హైదరాబాద్ నుంచి విజయానందనాథ గురుసేవా సమితి ప్రతినిధులు పుట్టమట్టి, సుగంధ ద్రవ్యాలు, విభూది కలిపిన సుమారు 40 కిలోలతో ఉన్న 25 బ్యాగుల ప్రత్యేక మట్టిని రైల్వే ఆలయానికి పంపించగా.. శివలింగాలను తయారు చేస్తున్నామని బృంద సభ్యులు తెలిపారు. శనివారం వరకు లక్షా 52 వేలు తయారు చేసినట్లు పేర్కొన్నారు. 25 రోజుల నుంచి ఈ శివలింగాలను తయారు చేస్తున్నామని వారు చెప్పారు. మహిమాన్విత కాశీ పుణ్యక్షేత్రంలో నవంబర్ 19 నుంచి 27వ తేదీ వరకు జరిగే కార్తీక మాసంలో కోటి లింగాలకు అభిషేకార్చనలో భాగంగా కాజీపేట రైల్వే ఆలయం నుంచి ఈశివ లింగాలను తయారు చేస్తున్నట్లు మహిళా భక్త బృందం తెలిపింది.