
హన్మకొండ: భారతదేశానికి శాంతి, అహింస మార్గం ద్వారా స్వాతంత్య్రం తీసుకొచ్చిన జాతిపిత మహాత్మా గాంధీ కలలను సాకారం చేసింది సీఎం కేసీఆర్ అని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. గాంధీ జయంతిని పురస్కరించుకుని సోమవారం హనుమకొండ పబ్లిక్ గార్డెన్‌లోని మహాత్ముడి విగ్రహానికి దయాకర్‌రావు పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈసందర్భంగా మంత్రి దయాకర్‌రావు మాట్లాడుతూ.. దేశానికి గాంధీ స్వాతంత్య్రం తీసుకొస్తే తెలంగాణ రాష్ట్రానికి కేసీ ఆర్ స్వాతంత్య్రం తీసుకొచ్చారన్నారు. మహాత్ముడి ఆలోచనలకు అనుగుణంగా సీఎం కేసీఆర్ గ్రామాలను అభివృద్ధి చేస్తున్నారన్నారు. కార్యక్రమంలో ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్‌భాస్కర్, ఎంపీ పసునూరి దయాకర్, హనుమకొండ, వరంగల్ జిల్లాల కలెక్టర్లు సిక్తాపట్నాయక్, ప్రావీణ్య, ‘కుడా’ చైర్మన్ సంగంరెడ్డి సుందర్‌రాజ్ యాదవ్, మున్సిపల్ కమిషనర్ రిజ్వాన్ బాషా అదనపు కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే, ట్రైనీ కలెక్టర్ శ్రద్ధా శుక్ల పాల్గొన్నారు.
మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు
పబ్లిక్ గార్డెన్‌లో
గాంధీ విగ్రహం వద్ద నివాళి
