
మాట్లాడుతున్న పెండెం రాజు
● టీఎస్ యూటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి
విద్యారణ్యపురి: టీచర్ల బదిలీలు, పదోన్నతులు పారదర్శకంగా నిర్వహించాలని టీఎస్ యూటీఎఫ్ హనుమకొండ జిల్లా ప్రధాన కార్యదర్శి పెండెం రాజు డిమాండ్ చేశారు. ఆదివారం హనుమకొండలోని ప్రభుత్వ ప్రాక్టీసింగ్ హైస్కూల్‌లో జరిగిన జిల్లా స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎస్జీటీ కేటగిరీ బదిలీల్లో స్పౌజ్ నిబంధనలు పాటించాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం పూర్తయిన హెచ్‌ఎంల బదిలీల్లో స్పౌజ్ కేటగిరీలో స్పౌజ్ దగ్గరి కి వెళ్లాలనే నిబంధన పాటించలేదని ఆరోపించారు. కొందరు స్పౌజ్ కేటగిరీ పాయింట్లు వాడుకొని హెచ్‌ఆర్‌ఏ పాఠశాలలను ఎంపిక చేసుకున్నారని ఆరోపించారు. మెడికల్, ప్రిఫరెన్షియల్ కేటగిరీల్లో వైద్య కారణాలతో బదిలీ పెట్టుకున్నవారిని ఫిజికల్‌గా వెరిఫికేషన్ చేయాలన్నారు. ఉపాధ్యక్షుడు సీహెచ్.రవీందర్‌రాజు, కోశాధికారి డి.కిరణ్‌కుమార్, కార్యదర్శులు మల్లిక్, భాస్కర్‌రావు పాల్గొన్నారు.