
దరఖాస్తులు స్వీకరిస్తున్న కలెక్టర్ ప్రావీణ్య
కరీమాబాద్/కాజీపేట అర్బన్ : దివ్యాంగుల సమస్యలను పరిష్కరించేందుకు హనుమకొండ, వరంగల్ కలెక్టరేట్లలో శనివారం ప్రత్యేక గ్రీవెన్స్ నిర్వహించారు. వరంగల్‌లో కలెక్టర్ ప్రావీణ్య దరఖాస్తులు స్వీకరించారు. ఈసందర్భంగా కలెక్టర్ ప్రావీణ్య మాట్లాడుతూ.. దివ్యాంగులు, వృద్ధుల సమస్యలను పరిష్కరించేందుకు పభుత్వం కృషి చేస్తున్న నేపథ్యంలో అధికారులు ప్రణాళికాబద్ధంగా వ్యవహరించాలని సూచించారు. కార్యక్రమంలో డీడబ్ల్యూఓ శారద, జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి చంద్రకుమార్ తదితరులు పాల్గొన్నారు.