
ఇళ్ల మధ్య పెరిగిన పిచ్చిమొక్కలు
కాజీపేట అర్బన్: 44వ డివిజన్ పరిధి కడిపికొండ రాజీవ్ గృహ కల్ప సముదాయంలోని ఇళ్లవాసులకు ఇప్పటికీ మట్టి రోడ్డే గతి. ఖాళీ స్థలాల్లో ఇళ్ల నడుమ ఏపుగా పెరిగిన పిచ్చి మొక్కలు, మట్టి రోడ్డుపై గుంతలు ఏర్పడి వర్షపు నీరు నిల్వ ఉంటోంది. దీంతో దోమలు స్వైర విహారం చేస్తున్నాయి. కొద్ది రోజుల క్రితం 16 నెలల బాలుడు డేవిడ్‌రాజ్ డెంగీతో మృతి చెందాడు. డివిజన్ పరిధి కడిపికొండ, రాజీవ్ గృహకల్ప, కొత్తపల్లి, భట్టుపల్లి గ్రామాల్లో వైరల్ ఫీవర్స్, మలేరియా, డెంగీ కేసులు నమోదవుతున్నాయి. సైడ్ డ్రెయిన్ వ్యవస్థ లేని కారణంగా మురుగు నీరు ఇళ్లలోకి వస్తోంది.