
పద్మావతినగర్‌లో అస్తవ్యస్తంగా పారిశుద్ధ్యం
హసన్‌పర్తి: ఒకటో డివిజన్ ఎర్రగట్టు గుట్ట ప్రాంతంలోని పద్మావతినగర్ కాలనీలో మురికి కాల్వల నిర్మాణ పనులు మధ్యలోనే నిలిపేశారు. దీంతో డ్రెయినేజీ నీళ్లు ఇళ్ల మధ్య చేరి మురికి కూపాలుగా కనిపిస్తున్నాయి. దుర్వాసన వస్తోంది. దోమలు వ్యాపిస్తున్నాయి. దోమలు కుట్టడంతో కాలనీవాసులు పలువురు జ్వరాల బారిన పడి ఆస్పత్రిలో చేరారు. కనీసం మురికి కాల్వలు కూడా శుభ్రం చేసే వారు లేరు. రెండేళ్లుగా ఈ కాలనీది దయనీయ పరిస్థితి.
ఆకాశహర్మ్యాలు.. మురికి కూపాలు!