
వివేకానంద కాలనీలో..
కాశిబుగ్గ: 18, 19, 20, 35వ డివిజన్లలో సరైన డ్రెయినేజీ వ్యవస్థ లేదు. ఉన్న ప్రాంతాల్లో రోజూ శుభ్రం చేయట్లేదు. 19వ డివిజన్ వివేకానంద కాలనీలో గీతాంజలి హైస్కూల్ ఎదురుగా డ్రెయినేజీలో రామసముద్రం చెరువు నీళ్లు కలిసి మురుగునీరు రోడ్లపై పారుతోంది. వాటిని తొలగించకపోవడంతో నీరు నిల్వ ఉండి దుర్వాసన వస్తోంది. సొసైటీ కాలనీలో రోడ్లను శుభ్రం చేయకపోవడం, సరైన డ్రెయినేజీ వ్యవస్థ లేకపోవడంతో చెత్త పేరుకుపోయింది. దోమలు రోజురోజుకూ వృద్ధి చెందుతున్నాయి. ఏనుమాముల మార్కెట్, కాశిబుగ్గ రహదారి వెంట వివేకానంద కాలనీలో ఖాళీ ప్లాట్లలో వర్షపు నీరు నిలిచింది. ఈగలు, దోమలకు ఆవాసంగా ఖాళీ స్థలాలు మారాయి. పందులు సంచరిస్తున్నాయి.
అధ్వానం.. అస్తవ్యస్తం