కేయూ క్యాంపస్: కేయూలోని సైన్స్ విభాగంలో శుక్రవారం బయోటెక్నాలజీ, మైక్రో బయాలజీ విభాగాల్లో సైన్స్ డీన్ ఆచార్య పి.మల్లారెడ్డి డిపార్ట్‌మెంటల్ రీసెర్చ్ కమిటీ సమావేశాలు నిర్వహించి పీహెచ్‌డీ అభ్యర్థులకు గైడ్‌లను కేటాయించారు. ఇప్పటికే జువాలజీ, ఫిజిక్స్, జియాలజీ విభాగాల్లో గైడ్‌లను కేటాయించినట్లు మల్లారెడ్డి తెలిపారు. ఈనెల 21న కేయూ ఫార్మసీ కళాశాలలో డీన్ ఆచార్య వై.నర్సింహారెడ్డి గైడ్‌లను కేటాయించారు. పీహెచ్‌డీ సీట్లు పొందిన అభ్యర్థులు ఇప్పటికే జాయినింగ్ రిపోర్ట్‌ను ప్రిన్సిపాల్ కార్యాలయంలో అందించారు. వివిధ విభాగాల్లో పీహెచ్‌డీ అభ్యర్థులకు గైడ్‌ల కేటాయింపులను డీన్‌లు చేపడుతున్నారు.