
చిన్నవడ్డేపల్లి వద్ద నిమజ్జన ఏర్పాట్లను పరిశీలిస్తున్న కలెక్టర్, సీపీ, కమిషనర్
వరంగల్ కలెక్టర్ ప్రావీణ్య, సీపీ రంగనాథ్,
వరంగల్: నగరంలో గణేశ్ నిమజ్జనానికి పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని వరంగల్ కలెక్టర్ ప్రావీ ణ్య, పోలీస్ కమిషనర్ ఏవీ రంగనాథ్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం సాయంత్రం వరంగల్ నగర పరిధిలోని నిమజ్జన ప్రాంతాలైన కోటచెరువు, చిన్నవడ్డేపల్లి, ఉర్సు చెరువు ప్రాంతాల్లో కలెక్టర్, సీపీ, బల్దియా కమిషనర్ షేక్ రిజ్వాన్‌బాషాతో కలిసి క్షేత్ర స్థాయిలో పర్యటించి నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఇరిగేషన్, ఎలకి్ట్రకల్, ఆర్‌అండ్‌బీ, ఫిషరీస్, మున్సిపల్ అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. నిమజ్జనం సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అప్రమత్తంగా ఉండాలని, శానిటేషన్‌తోపాటు తగి నంత లైటింగ్, మంచినీటి సౌకర్యం, క్రేన్‌ల ఏర్పాట్లతో సిద్ధంగా ఉండాలన్నారు. సీపీ రంగనాథ్ మాట్లాడుతూ చెరువుల్లో నీటిమట్టం ఎక్కువగా ఉన్నందున గజ ఈతగాళ్లను అందుబాటులో ఉంచుకోవాలన్నారు. కార్యక్రమంలో రెవెన్యూ, పోలీస్, ఆర్‌అండ్‌బీ, ఇరిగేషన్, విద్యుత్, మత్స్యశాఖ, బల్దియా అధికారులు పాల్గొన్నారు.
హసన్‌పర్తి పెద్దచెరువులో..
హసన్‌పర్తి: హసన్‌పర్తి పెద్దచెరువును సెంట్రల్ జోన్ డీసీపీ ఎంఏ బారి సందర్శించారు. గోపాలపురం, కేయూసీ క్రాస్‌తోపాటు చుట్టు పక్కల గ్రామాలనుంచి వినాయక విగ్రహాలు ఇక్కడికి తీసుకువచ్చి నిమజ్జనం చేస్తారని డీసీపీ దృష్టికి తీసుకొచ్చారు. కాగా, ఈసారి 600 వినాయక విగ్రహాలు నిమజ్జనం అయ్యే అవకాశాలు ఉన్నాయని డీసీపీ చెప్పారు. డీసీపీ వెంట ఏసీపీ డేవిడ్‌రాజు, పోలీస్ ఇన్‌స్పెక్టర్ గోపి, ఏఎస్సై జనార్దన్ తదితరులు పాల్గొన్నారు.