
పేపర్ లీకేజీ అనే అనుభవంనుంచి జీవిత పాఠాలు నేర్చుకోవాలి.. వ్యక్తిత్వ నిర్మాణంపై ఏకాగ్రత పెట్టడం తప్ప వేరే ఏ కోణానికి ప్రాముఖ్యత ఇవ్వకూడదు. ఇన్నాళ్లు చదివింది వృథా అన్న భావనను విడనాడాలి. జరిగిపోయిన దాని గురించి చింతించవద్దు. రేపటి కోసం మనమెలా ఉండాలన్నది లక్ష్యంగా పెట్టుకోవాలి. నేను ఒక యోధుడిలా ముందుకు వెళ్తున్నా అన్న ఆత్మవిశ్వాసంతో సాగాలే తప్ప .. సమాజాన్ని నిందిస్తూ వ్యవస్థను నిందిస్తూ కుంగిపోకూడదు.
– డాక్టర్ ఎర్ర శ్రీధరాజు, మానసిక వైద్యనిపుణులు