మహిళలపై ఉపాధ్యాయుడి దాడి | - | Sakshi
Sakshi News home page

మహిళలపై ఉపాధ్యాయుడి దాడి

Mar 14 2023 1:30 AM | Updated on Mar 14 2023 1:30 AM

హసన్‌పర్తి : ముగ్గురు మహిళలపై ఓ ఉపాధ్యాయుడితో పాటు మరో ఇద్దరు దాడికి పాల్పడ్డారు. గాయాలపాలైన మహిళలు పోలీస్‌స్టేషన్‌లో సోమవారం ఫిర్యాదు చేశారు. హసన్‌పర్తికి చెందిన సారమ్మ, మంచిర్యాలకు చెందిన సమ్మక్క, ఎన్‌.సరోజలు ఆదివారం తల్లిగారి గ్రామమైన సీతంపేటలోని బంధువుల ఇంటిలో జరిగిన ఓ కార్యక్రమానికి హాజరయ్యారు. అనంతరం అక్కడే ఉంటున్న సోదరి కుమారుడు బోగి సుధాకర్‌ ఇంటికి వెళ్లారు. తమ ఇంటికి ఎందుకు వచ్చారని సుధాకర్‌తో పాటు బోగి కుమారస్వామి, పోగుల సరస్వతి దాడి చేశారని బాధితులు తెలిపారు. ప్రస్తుతం సుధాకర్‌ ధర్మసాగర్‌ మండలం పెద్దపెండ్యాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement