కాంస్య పతకాలతో మెరిసిన అక్కాచెల్లెలు | - | Sakshi
Sakshi News home page

కాంస్య పతకాలతో మెరిసిన అక్కాచెల్లెలు

Apr 4 2026 7:49 AM | Updated on Apr 4 2026 7:49 AM

కాంస్య పతకాలతో మెరిసిన అక్కాచెల్లెలు గుంటూరు వెస్ట్‌ (క్రీడలు): గుంటూరుకు చెందిన అక్కా చెల్లెళ్లు తోట నిహిత, తోట నీహలు ఇటీవల హైదరాబాద్‌లోని క్రాస్‌ కోర్టులో జరిగిన ఇండియన్‌ ఓపెన్‌ పికిల్‌ బాల్‌ టోర్నమెంట్‌లో కాంస్య పతకాలు సాధించారని కోచ్‌ ఆనంద్‌కుమార్‌ శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. తోట నీహ అండర్‌–12 బాలికల సింగిల్స్‌లో, తోట నిహిత అండర్‌–14 బాలికల సింగిల్స్‌లో ఈ పతకాలు సాధించారన్నారు. వీరిద్దరూ కోచ్‌ పి ఆనంద్‌కుమార్‌ వద్ద శిక్షణ పొందారు. ఇండియన్‌ ఓపెన్‌ పికిల్‌ బాల్‌ టోర్నమెంట్లో గుంటూరు క్రీడాకారినిలు మెడల్స్‌ సాధించినందుకుగాను ఏపీ పికిల్‌ బాల్‌ సంఘం కార్యదర్శి ఎన్‌ శ్రీధర్‌, అసోసియేషన్‌ ఆఫ్‌ గుంటూరు జిల్లా కార్యదర్శి జీవీఎస్‌ ప్రసాద్‌, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ డాక్టర్‌ ఎం శివకుమార్‌, ఉపాధ్యక్షులు డాక్టర్‌ టి హనుమంతరావు, అనురాధ, సంయుక్త కార్యదర్శి కె అరుణ్‌ కుమార్‌, మన్సూర్‌వలిలు అభినందించారన్నారు. జాతీయ క్రికెట్‌ అకాడమీ జోనల్‌ క్యాంప్‌నకు ఎంపికై న కౌశిక్‌ గుంటూరు వెస్ట్‌(క్రీడలు): గుంటూరు జిల్లా యువ క్రికెటర్‌ కెఎన్‌వీ కౌశిక్‌ జాతీయ క్రికెట్‌ అకాడమీ జోనల్‌ క్యాంప్‌నకు ఎంపికయ్యాడని జిల్లా క్రికెట్‌ అసోసియేషన్‌ త్రీమెన్‌ కమిటీ సభ్యుడు టీవీఎస్‌ శివరామకృష్ణ శుక్రవారం ఒక ప్రటనలో పేర్కొన్నారు. ఈ నెలలో డెహ్రాడూన్‌లో జరగనున్న జోనల్‌ క్యాంపులో కౌశిక్‌ పాల్గొంటాడన్నారు. అండర్‌ –16 (విజయ్‌ మర్చంట్‌ క్రికెట్‌ టోర్నమెంట్‌)లో అద్భుతంగా తన ఎడమ చేతి బ్యాటింగ్‌తో ప్రతిభ కనబరిచి, ఆంధ్రా జట్టును నాకౌట్‌ తీసుకువెళ్లటంలో కీలక భూమిక పోషించాడన్నారు. జోనల్‌ క్యాంపునకు కౌశిక్‌ ఎంపికావటం అభినందనీయమని భవిష్యత్తులో జాతీయ స్థాయిలో రాణించాలన్నారు. కౌశిక్‌కు గుంటూరు జిల్లా త్రీమెన్‌ కమిటీ సభ్యులు జీవీ శరత్‌ బాబు, సీహెచ్‌వి నాగరాజు అభినందించారన్నారు. సహకార సంస్థల పాలకవర్గాల్లో రిజర్వేషన్లు అమలు చేయాలి రైలు ఢీకొని గుర్తు తెలియని వ్యక్తి మృతి చీరాల రూరల్‌: రైలు ఢీకొని గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందిన సంఘటన గురువారం రాత్రి చీరాల–వేటపాలెం రైల్వేస్టేషన్ల మధ్య చోటు చేసుకున్నట్లు జీఆర్పీ ఎస్సై సీహెచ్‌.కొండయ్య శుక్రవారం తెలిపారు. మూడో నంబర్‌ రైలు పట్టాలపై వెళుతున్న రైలు బండిని గమనించకుండా వ్యక్తి పట్టాలు దాటుతున్నాడు. ఈ క్రమంలో రైలుబండి వ్యక్తిని ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడని ఎస్సై తెలిపారు. మృతుని వయసు 20 నుంచి 30 సంవత్సరాలు ఉంటాయని, మృతదేహం వద్ద ఎటువంటి ఆధారాలు లభించలేదని ఎస్సై తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చీరాల ప్రభుత్వాసుపత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

ముస్లిం యునైటెడ్‌ ఫ్రంట్‌

రాష్ట్ర ప్రెసిడెంట్‌ మహమ్మద్‌ కలీం

కొరిటెపాడు(గుంటూరు): ఎన్నికలు, నియామకాల ద్వారా ఏర్పడే సహకార రంగ సంస్థల పాలకవర్గాల్లో రిజర్వేషన్‌ (1964 సహకార రంగ చట్ట ప్రకారం) అమలు చేయాలని ముస్లిం యునైటెడ్‌ ఫ్రంట్‌ రాష్ట్ర ప్రెసిడెంట్‌ మహమ్మద్‌ కలీం శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్‌ సహకార రంగ సంస్థల పాలకవర్గాల్లో పేద, బడుగు, బలహీన వర్గాలు, మహిళలకు 50 శాతం రిజర్వేషన్‌ అమలు చేస్తూ, రాష్ట్రంలోని దాదాపు 2,500 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు, జిల్లా కేంద్ర సహకార బ్యాంకులు (డీసీసీబీ), జిల్లా కో–ఆపరేటివ్‌ మార్కెటింగ్‌ సొసైటీలకు (డీసీఎంఎస్‌), ఏపీ సహకార బ్యాంక్‌ (ఆప్కాబ్‌)లతోపాటు 1964 చట్టం పరిధిలోని సహకార రంగ సంస్థలకు పాలకవర్గాల్లో రిజర్వేషన్‌ అమలు పరుస్తూ నియామకాలు చేయాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం, సహకార శాఖ కమిషన్‌, సహకార శాఖ రిజిష్ట్రార్‌లకు ఆరు నెలల క్రితం పోస్ట్‌ ద్వారా వినతి పత్రం పంపించడం జరిగిందని వెల్లడించారు. 2026 జనవరి నెల 28వ తేదీన సుమారు 2000లకు పైగా ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలకు రిజర్వేషన్‌ అమలు చేయకుండా జీఓ నంబర్‌–60 ద్వారా పాలకవర్గాలను రాష్ట్ర ప్రభుత్వం నియమించిందన్నారు. అంతేకాకుండా ఉమ్మడి 13 జిల్లాల కేంద్ర సహకార బ్యాంకుల చైర్మన్‌లను అఫీషియల్‌ పర్సన్‌ ఇన్‌చార్జిలుగా నియమిస్తూ, ఆప్కాబ్‌ చైర్మన్‌, జిల్లా కేంద్ర సహకార బ్యాంకు చైర్మన్‌ల పదవి కాలాన్ని ఆరు నెలలు పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం బాధాకరమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే సహకార సంస్థలకు ఎన్నికలు నిర్వహించి, పేద, బడుగు, బలహీనవర్గాల వారికి పదవుల్లో న్యాయం చేయాలని ఆయన కోరారు. .

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement