ఈస్ట్‌ బైపాస్‌ సాధికార సమితి ఏర్పాటు | - | Sakshi
Sakshi News home page

ఈస్ట్‌ బైపాస్‌ సాధికార సమితి ఏర్పాటు

Apr 4 2026 7:49 AM | Updated on Apr 4 2026 7:49 AM

ఈస్ట్‌ బైపాస్‌ సాధికార సమితి ఏర్పాటు

మాజీ సీఎం వై.ఎస్‌.జగన్‌ ప్రతిపాదిత రాజధాని మావిగన్‌కి ఈస్ట్‌ బైపాస్‌ ప్రాణదాయని త్వరలో భవిష్యత్‌ కార్యాచరణ, ప్రణాళిక రూపకల్పన

దుగ్గిరాల: ఈస్ట్‌ బైపాస్‌ మావిగన్‌కి ప్రాణదాయని అని, ప్రాచీన పోర్టు సిటి మచిలీపట్నం వలన మన రాష్ట్ర రాజధాని నుంచి విదేశాలకు లాజిస్టిక్స్‌ సౌకర్యం, ఉపాధి అవకాశాలు మెరుగు పడతాయని వైఎస్సార్‌సీపీ పంచాయతీరాజ్‌ వర్కింగ్‌ ప్రసిడెంట్‌ దాసరి వీరయ్య అన్నారు. దుగ్గిరాల మండలం పేరుకలపూడి, చుక్కపల్లివారిపాలెం గ్రామాల మధ్య శుక్రవారం సమితి నాయకులు సమావేశం అయ్యారు. ముందుగా వందలాది మంది వైఎస్సార్‌ సీపీ నాయకులు, కార్యకర్తలు సమావేశం కాగా చర్చించి, అనంతరం పేరుకలపూడి నుంచి బైపాస్‌ మార్కింగ్‌ ఇచ్చిన ప్రదేశానికి చేరుకున్నారు. అనంతరం సమావేశంలో పాల్గొన్న దాసరి వీరయ్య మాట్లాడుతూ మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వంలో రూ.4,600 కోట్లతో ఈస్ట్‌ బైపాస్‌ ప్రాజెక్టుని రూపొందించారని తెలిపారు. ప్రాజెక్టు నేషనల్‌ హైవే అథారిటీ అనుమతి కూడా లభించగా ప్రభుత్వం మారిన వెంటనే వైఎస్‌ జగన్‌కు పేరు వస్తుందని దాన్ని అటకెక్కించారని అన్నారు. మావిగన్‌కు ప్రాణదాయనిగా ఉంటుందని, విజయవాడ రామవరప్పాడు, బెంజి సర్కిల్‌ వంటి ప్రాంతాలలో ట్రాఫిక్‌ రద్దీని తగ్గిస్తూ చినఅవుటుపల్లి నుంచి కాజా వరకు 50 కిలోమీటర్ల పరిధిలో ప్రాజెక్టు నిర్ణయించారని తెలిపారు. మంగళగిరి నియోజకవర్గంలోని 15 కిలోమీటర్లు గుండా ప్రయాణించడం ద్వారా ఇక్కడ రైతుల సరకు రవాణాకు, పసుపు యారుకు చేరుకోడానికి సులువుగా ఉంటుందని అన్నారు. మంత్రి నారా లోకేష్‌ మా ప్రాంత ప్రజలను అన్యాయం చేయకుండా మా ప్రతిపాదనను నెరవేర్చాలని కోరారు. ఎట్టి పరిస్థితుల్లో ఈస్ట్‌ బైపాస్‌ సాధన కోసం ఎంత వరకై నా పోరాటం చేస్తామని, ఈ ప్రాంత ప్రజలకు సుసాధ్యం చేద్దామని, పార్టీలకతీతంగా అందరం ఒక్కతాటిపై ప్రజలు ముందుకు రావాలని ఆయన కోరారు. కార్యక్రమంలో దుగ్గిరాల మండల జెడ్పీటీసీ సభ్యురాలు అరుణ, మంగళగిరి నియోజకవర్గ మైనార్టీ నాయకుల షేక్‌ జానీ బాషా, మాజీ సర్పంచ్‌ గంపల గంగాధర్‌, ఆనంద్‌, ప్రదీప్‌, చంటి, సురేష్‌, టి.గంగాధర్‌ యాదవ్‌, సతీష్‌, కమలాకర్‌, తిమోతి, సింగ్‌, సుదీర్‌, సాంబయ్య, వరప్రసాద్‌, యేసోబు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement