రుద్రాక్ష వాహనంపై మల్లేశ్వరుడు
మంగళగిరి టౌన్ : మంగళగిరి పట్టణంలోని గంగా భ్రమరాంబ సమేత మల్లేశ్వరస్వామి దేవస్థానంలో మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. గురువారం స్వామి వారు రుద్రాక్ష వాహనంపై భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు. స్వామి వారిని దర్శించుకునేందుకు భక్తులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. ఉత్సవ కై ంకర్య పరులుగా మంగళగిరి పట్టణానికి చెందిన మాజేటి ఉదయ్ శ్రీనివాస్, మురళీకృష్ణ, ఉదయ్‌కుమార్, బాలగంగాధర గుప్తా, రంగా సత్యనారాయణ, శివ మోహన్‌మూర్తి సురేంద్రబాబు, పెద్దబాబు, శివప్రసాదరావు, రంగారావు గుప్తా, రవీంద్రనాఽథ్ గుప్తా, గోపాలకృష్ణ కుమార్, మధు సూదన వెంకట సుబ్బారావు, చెన్నకేశవ శేషగిరిరావులు వ్యవహరించారు. ఈవో గోపీ ఉత్సవ నిర్వహణను పర్యవేక్షించారు.
మంగళగిరి టౌన్ : మంగళగిరిలో అక్రమంగా గోవులను తరలిస్తున్న వాహనాన్ని మంగళగిరి రూరల్ పోలీసులు గురువారం అదుపులోకి తీసుకున్నారు. సేకరించిన వివరాల మేరకు గురువారం తెల్లవారుజామున విజయవాడ నుంచి గుంటూరు వెళుతున్న వాహనాన్ని పలువురు గోసంరక్షణ వాదులు వెంబడించి కాజ టోల్‌గేటు వద్ద అడ్డుకుని మంగళగిరి రూరల్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు వాహనాన్ని స్టేషన్‌కు తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ సందర్భంగా గో సంరక్షణ, బీజేపీ నాయకులు మాట్లాడుతూ ఓ చిన్న వాహనంలో సుమారు 25 దూడలను పెట్టి, వాటికి ఊపిరి ఆడకుండా చేయడంతో వాటిలో ఏడు దూడలు మృత్యువాత పడ్డాయని, సుమారు 12 గంటల పాటు వాటికి నీళ్లు, ఆహారం లేక సొమ్మసిల్లి పోయాయని తెలిపారు. అక్రమంగా తరలిస్తున్న యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
గుంటూరు ఎడ్యుకేషన్: ఉమ్మడి గుంటూరు జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం ఈనెల 21వ తేదీన జరగనుంది. ఈ మేరకు జెడ్పీ సీఈవో వి.జ్యోతిబసు గురువారం షెడ్యూల్ విడుదల చేశారు. జెడ్పీ చైర్‌పర్సన్ కత్తెర హెనీ క్రిస్టినా అధ్యక్షతన 21న ఉదయం 11 గంటలకు జెడ్పీ సమావేశ మందిరంలో జరగనున్న సర్వసభ్య సమావేశంలో గుంటూరు, పల్నాడు, బాపట్ల జిల్లాల పరిధిలోని ప్రజా ప్రతినిధులు, అధికారులు, జెడ్పీటీసీలు హాజరై అజెండాలోని అంశాలపై చర్చిస్తారు.
తాడికొండ: తుళ్ళూరు మండలం పెదపరిమిలోని మువ్వా చిన్న బాపిరెడ్డి మెమోరియల్ ట్రస్ట్ నిర్వహిస్తున్న వృద్ధాశ్రమానికి దాతలు ఆర్థిక సహాయం అందజేశారు. గ్రామ మాజీ సర్పంచ్ కొండా సాంబిరెడ్డి లక్ష రూపాయలు, మేక భారతి లక్ష రూపాయలు, కొల్లి కోటిరెడ్డి 50 వేల రూపాయలు చెక్కులను గురువారం మేనేజింగ్ ట్రస్ట్ ఎంవీ రామిరెడ్డికి అందజేశారు. దాతలు కొండా సాంబిరెడ్డి, మేక భారతి మాట్లాడుతూ నిస్వార్థంగా సేవలందిస్తున్న ట్రస్ట్‌కు సహకారం అందించడం బాధ్యతగా భావిస్తున్నామని తెలిపారు. అనంతరం దాతలను శాలువా, జ్ఞాపికలతో సత్కరించారు. కార్యక్రమంలో హేమంత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
రుద్రాక్ష వాహనంపై మల్లేశ్వరుడు
రుద్రాక్ష వాహనంపై మల్లేశ్వరుడు


