క్వారీ తిరునాళ్లకు భారీ విద్యుత్‌ ప్రభలు | - | Sakshi
Sakshi News home page

క్వారీ తిరునాళ్లకు భారీ విద్యుత్‌ ప్రభలు

Feb 13 2026 3:39 AM | Updated on Feb 13 2026 3:39 AM

క్వార

క్వారీ తిరునాళ్లకు భారీ విద్యుత్‌ ప్రభలు

● దాదాపు వంద అడుగుల ఎత్తులో నిర్మించే భారీ విద్యుత్‌ ప్రభలు సుమారు రూ. 5 లక్షల నుంచి రూ.10 లక్షల వ్యయంతో రూపుదిద్దుకుంటున్నాయి. నారాకోడూరు–జీబీసీ రోడ్డులోని శివాలయం ఎదురుగా మిత్ర మండలి, తెనాలి రోడ్డులోని గ్రామ ప్రభ, గుంటూరు రోడ్డులోని మార్కెట్టు కాంప్లెక్స్‌ ఎదురుగా గ్రామ సెంటర్‌ భారీ విద్యుత్‌ ప్రభలు తుది మెరుగులు దిద్దుకుంటున్నాయి. ● చేబ్రోలు గ్రామ ప్రభ, గుండవరం, గొడవర్రు, సుద్దపల్లి గ్రామ ప్రభలు ముస్తాబవుతున్నాయి. గత వంద సంవత్సరాలుగా దేవాలయానికి భక్తులు ప్రభలు నిర్మించుకురావటం ఇక్కడ ఆనవాయితీగా వస్తోంది. ● ఇక క్వారీ దేవాలయం వద్ద అన్ని శాఖల అధికారుల భక్తుల కోసం ఏర్పాట్లు చేస్తున్నారు. ● దేవాలయం పరిసర భూములు క్వారీలుగా మారటంతో పాటు దేవాలయం చుట్టుపక్కల గోడలు నిర్మించటంతో దేవాలయం చుట్టూ వాహనాలు రాకపోకలు సాగించటానికి కొంత ఇబ్బంది ఏర్పడుతున్నది. దేవాలయం వద్దకు వ్యాపారాలు నిర్వహించుకోవటానికి చిరు వ్యాపారులు తరలివస్తున్నారు. జెయింట్‌ వీల్‌, రంగుల రాట్నాలు, ట్రైన్స్‌ ,తదితర ఏర్పాట్లు చేసుకున్నారు. ● దేవదాయశాఖ ఆధ్వర్యంలో మూడు రోజులపాటు పలు కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ● సుద్దపల్లి, నారాకోడూరు, శలపాడు గ్రామాలకు చెందిన పొక్లయినర్‌ యజమానులు, లారీ యజమానులు క్వారీ బాలకోటేశ్వరస్వామికి పూజలు నిర్వహించిన అనంతరమే పనులు ప్రారంభిస్తుంటారు.

చేబ్రోలు: మహాశివరాత్రి సందర్భంగా వడ్లమూడి క్వారీ తిరునాళ్లకు వచ్చే భారీ విద్యుత్‌ ప్రభలు తుది మెరుగులు దిద్దుకుంటున్నాయి. చేబ్రోలు మండలం వడ్లమూడి క్వారీ బాలకోటేశ్వరస్వామి తిరునాళ్ల సందర్భంగా పరిసర గ్రామాల నుంచి భారీ విద్యుత్‌ ప్రభలతో పాటు చిన్నచిన్న ప్రభలు వందల సంఖ్యలో వస్తుంటాయి. ఈ ఏడాది నారాకోడూరులో నాలుగు భారీ విద్యుత్‌ ప్రభలు రూపుదిద్దుకుంటున్నాయి. సుద్దపల్లి, గొడవర్రు, గుండవరం, చేబ్రోలు, వడ్లమూడి గ్రామాల నుంచి భారీ ప్రభలు అందంగా ముస్తాబై తరలిరావటానికి సిద్ధమవుతున్నాయి.

వాహనాల రాకపోకలకు ఇబ్బంది...

ఆలయం వద్ద భక్తుల పొంగళ్లు

చేబ్రోలు: మహాశివరాత్రికి మూడు రోజుల ముందుగానే వడ్లమూడి క్వారీ బాలకోటేశ్వరస్వామి ఆలయానికి భక్తుల రాక ఆరంభమైంది. గురువారం దశమి కావటంతో మహిళలు ఉదయాన్నే ఆలయానికి చేరుకొని మొక్కులు తీర్చుకున్నారు. ఆలయ ప్రాంగణం వద్ద ఏర్పాటు చేసిన ప్రత్యేక షెడ్డుల్లో పొంగళ్లు పొంగించుకొని, స్వామి వారికి సమర్పించారు.

క్వారీ తిరునాళ్లకు భారీ విద్యుత్‌ ప్రభలు 1
1/1

క్వారీ తిరునాళ్లకు భారీ విద్యుత్‌ ప్రభలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement