మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభం | - | Sakshi
Sakshi News home page

మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభం

Feb 13 2026 3:39 AM | Updated on Feb 13 2026 3:39 AM

మహాశి

మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభం

పెదకాకాని: గంగా భ్రమరాంబ సమేత మల్లేశ్వరస్వామి వారి దేవస్థానంలో గురువారం మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు భక్తిశ్రద్ధలతో ప్రారంభమయ్యాయి. మొదటి రోజు భ్రమరాంబ అమ్మవారిని పెళ్లి కుమార్తె అలంకారంలో భక్తులు దర్శించుకున్నారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా వేకువజామున ఐదు గంటలకు సుప్రభాత సేవతో పూజా కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. రాత్రి 10.30 గంటలకు ధ్వజారోహణ, ఆలయ బలిహరణ, తదితర కార్యక్రమాలు శైవాగమ పద్ధతిన దేవస్థానాచార్యులు పొత్తూరి సాంబశివరావు, ప్రధాన అర్చకస్వామి పొత్తూరి లక్ష్మీనారాయణ వరప్రసాద్‌ పర్యవేక్షణలో వేదపండితులు, అర్చకస్వాములచే నిర్వహించినట్లు ఆలయ ఉప కమిషనరు గోగినేని లీలాకుమార్‌, పాలకమండలి చైర్మన్‌ కోసూరు పూర్ణచంద్రరావు తెలిపారు. ఈ కార్యక్రమాలలో పాలకమండలి చైర్మన్‌, సభ్యులు, ఆలయ అధికారులు పాల్గొన్నారు.రాత్రికి పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో దాతలచే రూ.5 లక్షలతో నిర్మించిన పీపీజీఎల్‌ షెడ్‌, గ్రామోత్సవాల సేవలకు దాతలు సమర్పించిన లక్ష రూపాయల విలువైన ట్రక్కును ఎమ్మెల్యే డి.నరేంద్రకుమార్‌, డీసీ గోగినేని లీలాకుమార్‌లు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో షెడ్డు దాతలు నందిపాటి రామకృష్ణ శివకుమారి, నందిపాటి భరత్‌కుమార్‌ శోభ దంపతులు, ట్రక్కు దాతలు గోగినేని వీరాబాయి, శివరామ్‌ దంపతులు, భక్తులు పాల్గొన్నారు.

పండగ శోభను సంతరించుకున్న పెదకాకాని గంగా భ్రమరాంబ సమేత మల్లేశ్వరస్వామి ఆలయం

మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభం 1
1/2

మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభం

మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభం 2
2/2

మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement