ఎన్‌పీటీఈఎల్ ర్యాంకింగ్స్‌లో విజ్ఞాన్ యూనివర్సిటీకి ‘
చేబ్రోలు: చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్ యూనివర్సిటీకి ఐఐటీ మద్రాస్ విడుదల చేసిన జాతీయస్థాయి స్వయం ఎన్‌పీటీఈఎల్ ర్యాంకింగ్స్‌లో ప్రతిష్టాత్మక ‘ఏఏ గ్రేడ్’ లభించిందని ఇన్‌చార్జి వైస్ చాన్స్‌లర్ కేవీ క్రిష్ణకిషోర్ గురువారం తెలిపారు. ఈ సందర్భంగా ఇంచార్జి వైస్ చాన్స్‌లర్ మాట్లాడుతూ స్వయం ఎన్‌పీటీఈఎల్ విడుదల చేసిన తాజా ర్యాంకింగ్స్‌లో విజ్ఞాన్ యూనివర్సిటీ జాతీయ స్థాయిలో 29వ ర్యాంక్ సాధించి ‘ఏఏ గ్రేడ్’ను సొంతం చేసుకుందన్నారు. ఎన్‌పీటీఈఎల్ నిర్వహించిన వివిధ ఆన్‌లైన్ కోర్సులలో విజ్ఞాన్ విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని మొత్తం 4,881 కోర్సు సర్టిఫికెట్లు సాధించారని తెలిపారు. వీటిలో 145 గోల్డ్ సర్టిఫికెట్లు, 424 సిల్వర్ సర్టిఫికెట్లు, 2,136 ఎలైట్ సర్టిఫికెట్లు, 2,176 సాధారణ ఉత్తీర్ణత సర్టిఫికెట్లు ఉన్నాయని వివరించారు. 61 ఎన్‌పీటీఈఎల్ స్టార్స్ సర్టిఫికెట్లు లభించడంతో పాటు, 106 మంది విద్యార్థులు టాపర్స్‌గా నిలిచారని వెల్లడించారు. విజ్ఞాన్ యూనివర్సిటీ వరుసగా తొమ్మిదవ సారి జాతీయ స్థాయిలో టాప్–100లో స్థానం సంపాదించుకోవడం జరిగిందని పేర్కొన్నారు. ‘ఏఏ గ్రేడ్’ సాధించడానికి కృషి చేసిన టీం సభ్యులను విజ్ఞాన్ విద్యాసంస్థల చైర్మన్ లావు రత్తయ్య అభినందించారు.
దొంగతనం కేసులో 8 నెలల జైలుశిక్ష
చీరాలరూరల్: దొంగతనం కేసులో నిందితునిపై ఉన్న నేరారోపణలు రుజువు కావడంతో గురువారం న్యాయమూర్తి నిందితునికి ఎనిమిది నెలలపాటు సాధారణ జైలుశిక్షతోపాటు రూ.100 జరిమానా విధించినట్లు టూ టౌన్ సీఐ నాగభూషణం తెలిపారు. బుర్లవారిపాలెం పంచాయతీ సాయికాలనీలో నివాసముంటున్న కుంచాల అంకుల్ ఇంటిలో 2018 మేనెలలో అర్ధరాత్రి సమ యంలో గుర్తు తెలియని దొంగలు వస్తువులు దొంగిలించారు. బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు 457, 380 ఐపీసీ సెక్షల కింది కేసు నమోదుచేశారు. కేసును పూర్తిస్థాయిలో దర్యాప్తు చేపట్టారు. ఈ కేసులో ఆదినారాయణపురానికి చెందిన సాతుపాటి బాలరాజుని నిందితుడిగా తేల్చి సాక్ష్యాధారాలతో కోర్టులో చార్జిషీటు దాఖలుచేశారు. నిందితుడిపై ఉన్న నేరారోపణలను ఏపీపీ సీహెచ్.పద్మావతి సాక్ష్యాదారాలతో నిరూపించారు. కేసును విచారించిన అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి జె.కాత్యాయిని నిందితునికి 8నెలల సాధారణ జైలుశిక్షతోపాటు రూ.100 జరిమానా విధించారు.
ఎన్‌పీటీఈఎల్ ర్యాంకింగ్స్‌లో విజ్ఞాన్ యూనివర్సిటీకి ‘


