టీడీపీ క్షుద్ర రాజకీయాలు
వైఎస్ జగన్‌ను రాజకీయంగా ఎదుర్కోలేక పార్టీకి అండగా నిలిచే వారి మీద దాడులు చేసి భయభ్రాంతులకు గురిచేసే నీచ సంస్కృతికి చంద్రబాబు శ్రీకారం చుట్టారు. పోలీసులను అడ్డుపెట్టుకుని టీడీపీ నాయకులు ప్రతీకార రాజకీయాలకు పాల్పడుతున్నారు. పిన్నెల్లి గ్రామంలో వైఎస్సార్ సీపీకి ఉన్న ప్రజాబలాన్ని నిర్వీర్యం చేయాలన్న కుట్రతోనే సాల్మన్ హత్య జరిగింది. సాల్మన్ దేహాన్ని ఖననం చేయడానికి కూడా హైడ్రామా చేశారు. కడసారి చూపుకి కూడా నోచుకోనీయకుండా కుటుంబ సభ్యులను, బంధువులను, గ్రామస్తులను అడ్డుకున్నారు. కనీస మానవత్వం లేకుండా అడుగడుగునా క్షుద్ర రాజకీయాలు చేశారు. – పూనూరు గౌతమ్‌రెడ్డి, పార్లమెంట్ నియోజకవర్గ ఇన్‌చార్జి


