హాయి.. హాయిగా ఆరోగ్యంగా జీవిద్దాం.. | - | Sakshi
Sakshi News home page

హాయి.. హాయిగా ఆరోగ్యంగా జీవిద్దాం..

Jan 2 2026 11:12 AM | Updated on Jan 2 2026 11:12 AM

హాయి.. హాయిగా ఆరోగ్యంగా జీవిద్దాం..

హాయి.. హాయిగా ఆరోగ్యంగా జీవిద్దాం..

కొత్త ఏడాది..కొత్త ప్లాన్‌ బాస్‌..

కొద్దిపాటి జాగ్రత్తలతో ఆరోగ్యం పదిలం వైద్యుల సలహాలు, సూచనలు పాటించడం ద్వారా వ్యాధుల బారిన పడకుండా ఉండవచ్చు నూతన సంవత్సరంలో ఆరోగ్యంగా జీవించడానికి వైద్యుల సలహాలు

గుంటూరు మెడికల్‌: నూతన ఏడాది ప్రారంభంలో ప్రతి ఒక్కరు ఏదో ఒక మంచి నిర్ణయం తీసుకుని జీవితంలో ఎదిగేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటారు. ఎంత డబ్బు సంపాదించినా, ఎంత ఉన్నత ఉద్యోగాలు పొందినా ఆరోగ్యం సక్రమంగా లేకపోతే ప్రయోజనం సున్నా. అందుకే ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు. ఉన్న ఆరోగ్యం పోగొట్టుకుని దానికోసం లక్షలాది రూపాయలు ఖర్చుపెట్టి ఆస్పత్రులు చుట్టూ తిరుగుతూ నానా అవస్థలు పడటం కంటే వ్యాధుల రాకుండా కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకుని, వైద్యుల సలహాలు పాటిస్తే నిశ్చింతంగా జీవింవచ్చు. మారిన ఆధునిక జీవనశైలి, పెరుగుతున్న వాతావరణ కాలుష్యంతో పాటు పోటీ ప్రపంచంలో కొన్ని జాగ్రత్తలు పాటించకపోతే ఆరోగ్యం పాడయ్యే ప్రమాదం ఉంది. రోగాలు వచ్చిన తర్వాత వైద్యుల వద్దకు పరుగులు తీయటం కంటే ముందస్తుగా వైద్యుల చెప్పే సూచనలు, సలహాలు పాటించటం మంచిది. కొద్దిపాటి సూచనలు, సలహాలతో 2026లో ఆరోగ్యాన్ని పదిలంగా కాపాడుకుని హాయిగా జీవించేందుకు వైద్యుల సలహాలతో ‘సాక్షి’ అందిస్తున్న ప్రత్యేక కథనం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement