కలెక్టరేట్‌లో ఘనంగా నూతన సంవత్సర వేడుకలు
గుంటూరు వెస్ట్: నూతన సంవత్సరం 2026 వేడుకలు స్థానిక కలెక్టరేట్‌లో జిల్లా కలెక్టర్ ఎ.తమీమ్ అన్సారియా ఆధ్వర్యంలో గురువారం ఘనంగా జరిగాయి. అధికారులు, సిబ్బంది కలెక్టర్‌కు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం కలెక్టర్ కేంద్ర కమ్యూనికేషన్లు, గ్రామీణ అభివృద్ధి శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్ర శేఖర్‌కు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. కలెక్టర్‌కు జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ, డీఆర్వో షేఖ్ ఖాజావలి, తెనాలి సబ్ కలెక్టర్ సంజన సింహ, అదనపు కమిషనర్ చల్లా ఓబులేసు, ఆర్డీఓ కె.శ్రీనివాసరావు, జెడ్పీ సీఈఓ జ్యోతి బసు, కలెక్టరేట్ సిబ్బంది శుభాకాంక్షలు తెలిపారు.
కేక్ కట్ చేసిన జిల్లా కలెక్టర్ ఎ.తమీమ్ అన్సారియా


