దేవాది దేవుడు ఏసుక్రీస్తు
మేత్రాసన గురువులు
చిన్నాబత్తిని భాగ్యయ్య
ఫిరంగిపురం: దేవాది దేవుడు ఏసుక్రీస్తు అని గుంటూరు మేత్రాసన గురువులు చిన్నాబత్తిని భాగ్యయ్య అన్నారు. మండల కేంద్రంలోని బాలఏసు కథెడ్రల్ దేవాలయంలో మరియమాత దివ్యమాతృత్వదినోత్సవం, 2026 నూతన సంవత్సర ఆశీర్వాద దివ్యపూజాబలి బుధవారం అర్థరాత్రి నిర్వహించారు. ఆయన వాక్యోపదేశం చేస్తూ ప్రతి ఒక్కరూ దేవుడిని నిత్యం ప్రార్థన చేయాలని చెప్పా రు. దాని ద్వారా ఆయన ఆశీర్వాదం మనకు లభిస్తుందన్నారు. నూతన సంవత్సరంలో పాడిపంటలు బాగా పండాలని, ప్రజల కష్టాలు తొలగిపోవాలంటూ ప్రత్యేక ప్రార్థనలు చేశారు. కార్యక్రమంలో దేవాలయ విచారణ గురువులు మాలపాటి ఫాతిమామర్రెడ్డి, సహాయ విచారణ గురువు కె.సాగర్, మఠ కన్య సీ్త్రలు, సోడాలిటి సభ్యులు, ప్యారిష్ కౌన్సిల్, గుడిపెద్దలు, కథోళిక క్రైస్తవులు తదితరులు
పాల్గొన్నారు.
దేవాది దేవుడు ఏసుక్రీస్తు


