19న జిల్లా ఏపీ ఎన్జీవో అసోసియేషన్‌కు ఎన్నికలు | - | Sakshi
Sakshi News home page

19న జిల్లా ఏపీ ఎన్జీవో అసోసియేషన్‌కు ఎన్నికలు

Jan 2 2026 11:12 AM | Updated on Jan 2 2026 11:12 AM

19న జిల్లా ఏపీ ఎన్జీవో అసోసియేషన్‌కు ఎన్నికలు

19న జిల్లా ఏపీ ఎన్జీవో అసోసియేషన్‌కు ఎన్నికలు

గుంటూరు మెడికల్‌: ఏపీ ఎన్జీవో గుంటూరు జిల్లా శాఖకు ఎన్నికలు నిర్వహించేందుకు అసోసియేషన్‌ రాష్ట్ర ఆర్గనైజింగ్‌ సెక్రటరీ కిలారి జగదీశ్వరరావును ఎన్నికల అధికారిగా నియమించారు. ఏపీ ఎన్జీజీవోస్‌ రాష్ట్ర అధ్యక్షుడు అలపర్తి విద్యాసాగర్‌, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డి.వి.రమణలు ఎన్నికల అధికారిని నియమించారు. ఎన్నికల అధికారిగా నియమితులైన కిలారీ జగదీశ్వరరావు గుంటూరు జిల్లా ఎన్నికల షెడ్యూల్‌ను గురువారం విడుదల చేశారు. ఈ నెల 4న నామినేషన్‌ల స్వీకరణ, లీ నెల 19న ఓటింగ్‌ నిర్వహిస్తామని తెలిపారు. జిల్లాలో అధ్యక్ష, కార్యదర్శుల సహా 17 పోస్టులకు ఎన్నికలు నిర్వహిస్తున్నామన్నారు. గుంటూరు సిటీ, ప్రత్తిపాడు, దుగ్గిరాల, అమరావతి, మంగళగిరి, తెనాలి, పొన్నూరు తాలూకా యూనిట్లకు చెందిన 256 ఏపీ ఎన్జీజీవో సభ్యులు తమ ఓటు హక్కును జిల్లాలో వినియోగించుకుంటారని వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement