‘కాటూరి ఆర్ట్‌గ్యాలరీ’కి మరో కళాఖండం | - | Sakshi
Sakshi News home page

‘కాటూరి ఆర్ట్‌గ్యాలరీ’కి మరో కళాఖండం

Dec 29 2025 8:02 AM | Updated on Dec 29 2025 8:02 AM

‘కాటూరి ఆర్ట్‌గ్యాలరీ’కి మరో కళాఖండం

‘కాటూరి ఆర్ట్‌గ్యాలరీ’కి మరో కళాఖండం

తెనాలి: పట్టణ సరిహద్దుల్లోని కాటూరి ఆర్ట్‌ గ్యాలరీలో మరో కళాఖండం ఆవిష్కృతమైంది. 21.5 అడుగుల ఎత్తు, 18 అడుగుల వెడల్పు గల ఆరు పలకల మండపంలో రాజసింహాసనంపై ఆసీనుడైన ఛత్రపతి శివాజీ మహరాజ్‌ విగ్రహాన్ని స్థానిక సూర్యశిల్పశాల శిల్పకారులు రూపొందించారు. కాటూరి వెంకటేశ్వరరావు, ఆయన తనయులు రవిచంద్ర, శ్రీహర్ష సృజనతో తీర్చిదిద్దిన ఈ విగ్రహాన్ని ఆదివారం శిల్పశాల సిబ్బంది, స్థానికులు, విలేకరుల సమక్షంలో కాటూరి కొండమ్మ చేతుల మీదగా ఆవిష్కరింపజేశారు.

ఆర్ట్‌ గ్యాలరీకి మరో ఆభరణంలా అమరిని భారీమండపంలో రాజసింహాసనంపై ఛత్రపతి శివాజీ విగ్రహ తయారీకి వేలసంఖ్యలో ఆటోమొబైల్‌ విడిభాగాలు, నట్లు, బోల్టులు, బేరింగ్‌లు, చైన్లు, ఐరన్‌ స్క్రాప్‌లోని ఇతర భాగాలను వినియోగించు ఈ శిల్పాన్ని ఆరునెలల శ్రమతో తయారు చేసినట్టు ‘కళారత్న’ కాటూరి వెంకటేశ్వరరావు తెలిపారు. మండపంలోని స్తంభాలు గోపురం, అలంకరణలన్నీ సంప్రదాయ భారతీయ శిల్పశైలిని ఆధునిక ఐరన్‌ స్క్రాప్‌తో మేళవించిన ప్రయోగాత్మకంగా ఈ విగ్రహాన్ని రూపొందించామని చెప్పారు. ఈ ఐరన్‌ స్క్రాప్‌ విగ్రహం కేవలం ఒక శిల్పం మాత్రమే కాకుండా రీసైక్లింగ్‌ ద్వారా సామాజిక సందేశాన్ని అందించే గొప్ప కళాఖండంగా నిలుస్తుందని, వ్యర్థంగా భావించే లోహాన్ని కళగా మలచి భారతదేశ చరిత్రలోని మహానీయుడైన చత్రపతి శివాజీ మహారాజ్‌ను స్మరించడమే ఈ శిల్పం ప్రధాన లక్ష్యమని చెప్పారు. తమ సంస్థలో పనిచేస్తున్న 70 మంది కళాకారులని వారి కుటుంబసభ్యులతో సహా సత్కరించారు. మరిన్ని సృజనాత్మక శిల్పాల చేరుస్తూ ఆర్ట్‌ గ్యాలరీని పర్యాటక కేంద్రంగా రూపుదిద్దాలనేది తమ ఆకాంక్షగా శిల్పులు వివరించారు.

ఆరు పలకల భారీ మండపంలో

రాజసింహాసనంపై ఛత్రపతి

శివాజీ మహరాజ్‌

20 టన్నుల ఐరన్‌స్క్రాప్‌, 20 మంది టెక్నిషియన్లతో..

ఆరునెలల శ్రమకు ప్రతిరూపం

సిబ్బంది, స్థానికుల

సమక్షంలో ఆవిష్కరణ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement