రక్తదానం ప్రాణదానంతో సమానం | - | Sakshi
Sakshi News home page

రక్తదానం ప్రాణదానంతో సమానం

Dec 29 2025 8:02 AM | Updated on Dec 29 2025 8:02 AM

రక్తదానం ప్రాణదానంతో సమానం

రక్తదానం ప్రాణదానంతో సమానం

వైఎస్సార్‌ సీపీ జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు

రక్తదాతలకు ప్రశంసా పత్రాలు అందజేత

పట్నంబజారు: రక్తదానం ప్రాణదానంతో సమానం అని వైఎస్సార్‌ సీపీ జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు పేర్కొన్నారు. వైఎస్సార్‌ సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహనన్‌్‌ రెడ్డి జన్మదిన వేడుకలను పురస్కరించుకుని రక్తదానం చేసిన వారికి ఆదివారం ప్రశంసా పత్రాలు అందజేశారు. బృందావన్‌గార్డెన్స్‌లోని పార్టీ జిల్లా కార్యాలయంలో వైఎస్సార్‌ సీపీ జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు, మాజీ ఎంపీ, పల్నాడు, ఎన్టీఆర్‌ జిల్లా పరిశీలకులు మోదుగుల వేణుగోపాల్‌రెడ్డి, ఎమ్మెల్సీ చంద్రగిరి ఏసురత్నం, పార్టీ నగర అధ్యక్షురాలు, తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త షేక్‌ నూరిఫాతిమా, తాడికొండ నియోజకవర్గ సమన్వయకర్త వనమా బాలవజ్రబాబు, రాష్ట్ర కార్యదర్శి నిమ్మకాయల రాజనారాయణ, పార్టీ నేతలు, కార్పొరేటర్లలు, అనుబంధ విభాగాల అధ్యక్షులతో కలిసి ప్రశంసా పత్రాలు అందజేశారు. అంబటి రాంబాబు మాట్లాడుతూ వైఎస్‌ జగన్‌ జన్మదినాన్ని పురస్కరించుకుని జిల్లా పార్టీ కార్యాలయంలో జరిగిన రక్తదాన శిబిరంలో 240 మంది రక్తదానం చేయటం జరిగిందన్నారు. వైఎస్సార్‌ సీపీ ఆధ్వర్యంలో ఇటువంటి సేవా కార్యక్రమాలు సాగుతూనే ఉంటాయన్నారు. రక్తదానం చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement