ముగిసిన క్రీడోత్సవాలు
నరసరావుపేట రూరల్: ఏఎంరెడ్డి ఇంజినీరింగ్ కళాశాల ప్రాంగణంలో నిర్వహిస్తున్న ఏఎంఆర్ ఇగ్నైటెడ్ మైండ్ స్పోర్ట్స్ మీట్–25 క్రీడా పోటీలు ఆదివారం ఘనంగా ముగిశాయి. రాష్ట్రంలోని వివిధ ఇంజినీరింగ్, డిప్లమా కళాశాలల నుంచి విద్యార్థులు పోటీల్లో పాల్గొన్నారు. ఇంజినీరింగ్ విభాగంలో వాలీబాల్ పోటీల్లో సీఆర్ రెడ్డి కళాశాల జట్టు విజేతగా నిలిచింది. 100 మీటర్ల పరుగు పందెంలో ఎన్‌ఈసీ కళాశాల క్రీడాకారులు కె.వెంకటేష్ ప్రథమ స్థానం కై వసం చేసుకున్నాడు. కబడ్డీ పోటీల్లో విజ్ఞాన్ లారా ఇంజినీరింగ్ కళాశాల జట్టు విజేతగా నిలిచింది. మహిళల విభాగంలో త్రోబాల్ పోటీలో ఏఎంరెడ్డి ఇంజినీరింగ్ కళాశాల జట్టు ఫైనల్ పోటీలో విజయం సాధించింది. డిప్లమా విద్యార్థుల విభాగంలో నిర్వహించిన కబడ్డీ పోటీలో ఈశ్వర్ కళాశాల, వాలీబాల్ ఫైనల్ పోటీలో అద్దంకి పాలిటెక్నిక్ కళాశాల జట్లు గెలుపొందాయి. త్రోబాల్ పోటీలో ఏఎంరెడ్డి కాలేజి, మహిళల ఖోఖో పోటీలలో ఈశ్వర్ ఇంజినీరింగ్ కళాశాల జట్టు విజయం సాధించాయి. పోటీలో విజేతలకు ఈనెల 30వ తేదీ బహుమతి ప్రదానోత్సవం నిర్వహిస్తామని కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సీహెచ్ మల్లికార్జున్ తెలిపారు. విజేతలను కళాశాల ఛైర్మన్ అట్లూరి శాంతి శ్రీనివాసరెడ్డి అభినందించారు. డిప్లమా కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కె.కృష్ణారెడ్డి, ఫార్మసీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ పి.భార్గవ్‌భూషణరావు, అకడమిక్ డైరక్టర్ ఏ.పావని, అధ్యాపకులు, సిబ్బంది పాల్గొన్నారు.


