ఆధునిక విద్యాప్రదాత జగనన్న
గుంటూరు ఎడ్యుకేషన్: వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలను మార్చివేశారు. పాఠశాలలను ఆధునిక బాట పట్టించేందుకు ఆయన అమలు పరిచిన మనబడి నాడు–నేడు చరిత్రను తిరగరాసింది. మొదటి విడతలో గుంటూరు జిల్లాలోని 380 పాఠశాలలను రూ.68.88 కోట్ల వ్యయంతో సకల వసతులతో తీర్చిదిద్దారు. రెండో దశలో 563 పాఠశాలలను అన్ని మౌలిక వసతులతో తీర్చిదిద్దేందుకు రూ.215.75 కోట్లతో పనులు ప్రారంభించారు. విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా 165 పాఠశాలల్లో కొత్తగా 656 అదనపు తరగతి గదులు అందుబాటులోకి తెచ్చారు.
బ్రాండెడ్ మెటీరియల్
దశాబ్దాల తరబడి మౌలిక వసతులకు నోచుకోని పాఠశాలలను ఆధునికీకరించడంతో పాటు ప్రపంచస్థాయి ప్రమాణాలతో కూడిన బ్రాండెడ్ మెటీరియల్‌ను ఇచ్చి పనులు చేయించిన గత ప్రభుత్వం ప్రతి పాఠశాలకు కనీసంగా రూ.25 లక్షలు మొదలు అత్యధికంగా రూ.2.50 కోట్ల వరకు ఖర్చు చేసింది. విద్యార్థులకు సురక్షితమైన తాగునీటి కోసం ఆర్వో వాటర్ ప్లాంట్లు ఏర్పాటు చేయడంతో పాటు విద్యార్థులకు వేర్వేరుగా టాయిలెట్ల నిర్మాణం చేపట్టారు. టాయిలెట్లలో ఏర్పాటు చేస్తున్న మెటీరియల్ అంతా బ్రాండెడ్‌దే కావడం విశేషం. విద్యార్థులు తరగతి గదిలో సౌకర్యవంతంగా కూర్చునేందుకు వీలుగా డ్యూయల్ డెస్క్‌లు, ప్రతి తరగతి గదిలో సీలింగ్ ఫ్యాన్లు, ఎల్‌ఈడీ లైట్లతో పాటు బ్లాక్ బోర్డుల స్థానంలో కార్పొరేట్ పాఠశాలలను తలదన్నే విధంగా ఏర్పాటు చేసిన ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెల్ (ఐఎఫ్‌పీ) ల ద్వారా ఆధునిక విద్యాబోధన అందుబాటులోకి తెచ్చారు. విద్యార్థులను బడి బాట పట్టించేలా వసతులు వచ్చాయి.
జగన్ మామయ్య ముఖ్యమంత్రి అయిన తర్వాత మా పాఠశాల రూపురేఖలు మారిపోయాయి. నేను ఆరో తరగతి నుంచి ఇక్కడే చదువుతున్నాను. గతంలో నేలపై కూర్చునేవాళ్లం. జగన్ మావయ్య సీఎం అయ్యాక పాఠశాలను డెవలప్ చేసి, మాకు కూర్చునేందుకు డ్యూయల్ డెస్క్‌లు ఇచ్చారు. యూనిఫామ్‌తోపాటు బూట్లు, బెల్టు, సాక్సులు, టెక్ట్స్‌బుక్స్, నోట్ బుక్స్.. ఇలా అన్నీ ఇచ్చారు. అమ్మకు జగనన్న అమ్మఒడి ద్వారా ఆర్థిక సాయం చేశారు. గోరుముద్ద పథకాన్ని ప్రవేశపెట్టి రుచికరమైన భోజనం అందించారు. గతంలో టాయిలెట్‌కు వెళ్లాలంటే ముక్కు మూసుకునే పరిస్థితుల్లో టాయిలెట్లను ఎంతో పరిశుభ్రంగా తీర్చిదిద్దారు. జగన్ మావయ్య ఉంటే ప్రభుత్వ పాఠశాలలు ఎంతో బాగుండేవి.
– ఎంవీఎన్ సాయి వైష్ణవి, కల్లం అంజిరెడ్డి జెడ్పీ హైస్కూల్, తాడేపల్లి
జగన్ మావయ్య ముఖ్యమంత్రి అయిన తర్వాత మా స్కూల్లోనే అమ్మ ఒడి పథకం ప్రారంభించారు. ప్రస్తుతం నేను డిగ్రీ చదువుతున్నా. 2022 సంవత్సరంలో మా పాఠశాలలో నాడు–నేడు పనులు జరిగాయి. నేను 9,10 తరగతుల్లో ఉండగా, చెట్టు కింద కూర్చుని చదువుకున్నాం. టెన్త్ పూర్తి చేసే సమయానికి స్కూల్లో కొత్త భవనాలు నిర్మించారు. నాడు–నేడు ద్వారా ఆధునికీకరించిన మా పాఠశాలను చూస్తుంటే ఎంతో ఆనందంగా ఉంది. మేం చదువుకునే సమయంలో ఆడుకోవడానికి స్కూల్లో మైదానం కూడా సరిగా లేదు. జగన్ మావయ్య వచ్చిన తర్వాత స్కూలు గ్రౌండ్ రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి.
– షేక్ షణమ్, పెనుమాక జెడ్పీ హైస్కూల్ పూర్వ విద్యార్థిని
ఆధునిక విద్యాప్రదాత జగనన్న
ఆధునిక విద్యాప్రదాత జగనన్న
ఆధునిక విద్యాప్రదాత జగనన్న


