క్రీడలతో శారీరక, మానసిక దృఢత్వం
గుంటూరు ఎడ్యుకేషన్: క్రీడలతో శారీరక, మానసిక దృఢత్వంతో పాటు క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాలు అలవడతాయని జిల్లా మహిళా, శిశు సంక్షేమశాఖ ప్రాజెక్టు డైరెక్టర్ పి.ప్రసూన అన్నారు. గుజ్జనగుండ్లలోని ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్‌లో శుక్రవారం 28వ ప్రాంతీయ స్థాయి ఇంటర్ పాలిటెక్నిక్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్ నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న ప్రసూన మాట్లాడుతూ విద్యార్థినులు చదువుతో పాటు క్రీడలు, ఆటల పోటీల్లో ఉత్సాహంగా పాల్గొని, మేటి క్రీడాకారిణిలుగా ఎదగాలని సూచించారు. సాంతిక విద్యాశాఖ ఆర్జేడీ వి.పద్మారావు మాట్లాడుతూ ఏటా స్పోర్ట్స్ మీట్ నిర్వహిస్తున్నామన్నారు. క్రీడా పోటీలకు ఎస్వీయూ ప్రాంతీయ ఆర్జేడీ ఎ.నిర్మల్‌కుమార్ ప్రియ కన్వీనర్‌గా వ్యవహరించారు. కళాశాల ప్రిన్సిపాల్ జాస్తి ఉషారాణి, అధ్యాపకులు పాల్గొన్నారు.
క్రీడాపోటీల్లో విజేతలు వీరే
వాలీబాల్‌లో సెయింట్ మేరీస్ (బుడంపాడు), ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్ (గుంటూరు), షాట్‌పుట్‌లో ఎం.సాయిజ్యోతి, ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్ (గుంటూరు), పి.దివ్యాజంలి, హిందూ ఇంజినీరింగ్ కళాశాల (గుంటూరు), లాంగ్ జంప్‌లో బి.రుచిత, ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్ (గుంటూరు), డి.ప్రియాంక, సెయింట్ మేరీస్ (బుడంపాడు), డిస్క్‌త్రోలో ఎం.సాయి ఖాద్యోత, ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్ (గుంటూరు), వై. వైష్ణవి, సెయింట్ మేరీస్ (బుడంపాడు), చదరంగంలో టి. తన్మయ రెడ్డి, ఎంబీటీఎస్ ప్రభుత్వ పాలిటెక్నిక్ (గుంటూరు), ఎస్. త్రిష రెడ్డి (బాపట్ల పాలిటెక్నిక్), టేబుల్ టెన్నిస్ సింగిల్స్‌లో ఎస్. సుస్మిత, సెయింట్ మేరీస్ (బుడంపాడు), శ్రీ సాహితి, హిందూ ఇంజినీరింగ్ కళాశాల (గుంటూరు), డబుల్స్‌లో ఎస్.సుస్మిత, పి.భవ్య, హిందూ ఇంజినీరింగ్ కళాశాల (గుంటూరు), ఎం.నందిని, కె.షెరిష్మా సెయింట్ మేరీస్ (బుడంపాడు) విన్నర్, రన్నర్లుగా నిలిచారు.
జిల్లా మహిళా, శిశు సంక్షేమశాఖ పీడీ ప్రసూన
పాలిటెక్నిక్ కళాశాలల విద్యార్థినులకు క్రీడా పోటీలు


